ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్‌కు ఇంకో పది రోజుల సమయం కూడా లేదు. ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేుయడానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. విదేశాల్లో జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నడుస్తున్నాయి. త్వరలోనే ఇండియాలోనూ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు.
ఈ టైంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే సూచనలు కనిపిస్తుండటంతో ఈ సినిమా విడుదలై సందేహాలు మొదలయ్యాయి. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో ఆంక్షల దిశగా అడుగులు పడుతున్నాయి. ఢిల్లీలో థియేటర్లు మూత వేసేశారు ఆల్రెడీ. దీంతో హిందీ మూవీ ‘జెర్సీ’ రిలీజ్ ఆగిపోయింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ కూడా వాయిదా పడక తప్పదేమో అన్న ప్రచారం మొదలైంది.
కానీ చిత్ర బృందం వెనక్కి తగ్గే అవకాశమే లేదని తెలుస్తోంది. ఈ విషయమై స్వయంగా రాజమౌళే స్పష్టత ఇచ్చేశాడు. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ కమ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఎక్స్‌క్లూజివ్ న్యూస్‌గా పేర్కొంటూ ‘ఆర్ఆర్ఆర్’ అనుకున్నట్లే జనవరి 7న విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజమౌళికి తాను ఫోన్ చేశానని.. వాయిదాకు ఆస్కారమే లేదని, అనుకున్న ప్రకారమే సినిమా రిలీజవుతుందని ఆయన స్పష్టత ఇచ్చారని, కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ 7న వచ్చే విషయంలో సందేహాలేమీ పెట్టుకోవద్దని ఆయన తేల్చేశాడు.
ఈ రోజు కేరళలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ఆ వేడుకకు కేరళ ముఖ్యమంత్రి కూడా రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. చిత్ర బృందం ప్రమోషన్ల విషయంలో ఎంతమాత్రం తగ్గట్లేదంటే విడుదల విషయంలోనూ తగ్గనట్లే. ఢిల్లీలోనో, ఇంకో ఏరియాలోనో వసూళ్లకు కోత పడుతుందని.. ఈ దశలో సినిమా రిలీజ్ వేయడం కరెక్ట్ కాదని, దాని వల్ల తీవ్ర ఇబ్బందులు తప్పవని భావించే విడుదల విషయంలో ముందుకెళ్లిపోవాలనే డిసైడైనట్లుంది రాజమౌళి టీం.
This post was last modified on December 29, 2021 7:23 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…