టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ లో కనిపించి వెండితెరని షేక్ చేసింది. ఇప్పుడు యూట్యూబ్ లో ఆ పాట టాప్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
ఈ సినిమా కథ విన్నప్పుడు సమంత చాలా ఎగ్జైట్ అయిందట. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో నడిచే సినిమా అని..సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో సమంత ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో తొలిసారి సమంత నర్స్ పాత్రలో కనిపించబోతుందట.
ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా కావడంతో.. కథ మొత్తం సమంత చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. సామ్ తన పాత్ర విషయంలో సూపర్ ఎగ్జైటెడ్ గా ఉందట. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వచ్చే వేసవికి సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
This post was last modified on December 29, 2021 10:51 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…