Movie News

ఏడ్చేసిన సుక్కు, బ‌న్నీ

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల అనుబంధం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. బ‌న్నీని స్టార్‌ను చేసిన సినిమా, సుకుమార్‌కు ద‌ర్శ‌కుడిగా జీవితాన్నిచ్చిన సినిమా ఒక్క‌టే. అదే.. ఆర్య‌. అందుకే ఒక‌రిపై ఒక‌రికి కృత‌జ్ఞ‌తా భావం ఉంది. ఆ సినిమాతో మొద‌లైన స్నేహం గొప్ప అనుబంధానికి దారి తీసింది. అందుకే ఇద్ద‌రూ ఒక‌రి గురించి ఒక‌రు మాట్లాడేట‌పుడు ఆ ప్రేమ అంతా క‌నిపిస్తుంటుంది.

ముఖ్యంగా బ‌న్నీ.. సుకుమార్ పేరెత్తితే చాలు.. కొంత ఎమోష‌న‌ల్ కూడా అవుతుంటాడు. తాజాగా వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన పుష్ప మూవీ కూడా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌నే రాబ‌ట్టుకుంటోంది. ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా తాజాగా హైద‌రాబాద్‌లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఇందులో బ‌న్నీ మాట్లాడుతూ చాలా ఎమోష‌న‌ల్ అయిపోయాడు. అత‌డి మాట‌లు విని సుకుమార్ క‌న్నీళ్లు పెట్టుకోగా.. అది చూసి బ‌న్నీ కూడా ఏడ్చేయ‌డం గ‌మ‌నార్హం.

తాను కెరీర్లో ఈ స్థాయిలో ఉండ‌టానికి ముందుగా త‌న తాత‌య్య అల్లు రామ‌లింగ‌య్య‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల‌ని, ఆయ‌నే వ‌చ్చి ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డ‌క‌పోయి ఉంటే ఇప్పుడు తాను ఇక్క‌డ ఉండేవాణ్ని కాద‌ని బ‌న్నీ అన్నాడు. ఇక ఆ త‌ర్వాత కృతజ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సింది త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రుల‌క‌ని.. ఆ త‌ర్వాత త‌న కెరీర్ ఆరంభం నుంచి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవికి తాను కృత‌జ్ఞుడిన‌ని బ‌న్నీ అన్నాడు. ఇక ఆ త‌ర్వాతి స్థానం సుకుమార్‌కే అని, ఆర్య సినిమాతో త‌న కెరీర్‌కు టేకాఫ్ ఇచ్చింది ఆయ‌నే అని బ‌న్నీ చెప్పాడు.

ఈ సంద‌ర్భంగా అత‌నో సంఘ‌ట‌న గుర్తు చేసుకున్నాడు. ఆర్య రిలీజైన నాలుగైదేళ్ల‌కు తాను ప‌రుగు సినిమా చేస్తున్న స‌మ‌యంలో ఒక స్పోర్ట్స్ కారు కొన్నాన‌ని, దాని రేటు రూ.85 ల‌క్ష‌ల‌ని, ఆ కార్లో కూర్చుని స్టీరింగ్ మీద చేయి వేసిన‌పుడు తాను ఇప్పుడీ స్థాయిలో ఉండ‌టానికి ఎవ‌రు కార‌ణం అని ఆలోచిస్తే ముందు త‌ట్టిన పేరు సుకుమార్‌దే అని అన్నాడు. ఈ మాట‌కు సుక్కు ఉద్వేగానికి గుర‌య్యాడు. చేతుల్లో ముఖం పెట్టుకుని ఏడ్చేశాడు. అది చూసి బ‌న్నీ సైతం స్టేజ్ మీద ఏడ్చేసి క‌న్నీళ్ల‌ను క‌ర్చీఫ్‌తో తుడుచుకున్నాడు.

This post was last modified on December 28, 2021 8:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago