టాలీవుడ్లో చాలామంది వారసలు తెరంగేట్రం చేశారు. ఐతే అందరిలోకి ఏ వారసుడి సినిమాకు ఎక్కువ హైప్ వచ్చింది అంటే అక్కినేని అఖిల్ అనే చెప్పాలేమో. రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’కూ మంచి బజ్ వచ్చినప్పటికీ.. దాన్ని మించిన హైప్ ‘అఖిల్’ సినిమాకు వచ్చింది. డిజాస్టర్ టాక్‌తో మొదలైనప్పటికీ ‘చిరుత’ డే-1 రికార్డును ‘అఖిల్’ బద్దలు కొట్టడం విశేషం. ఐతే తొలి సినిమా ముంగిట తనకున్న హైప్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను నిలబెట్టుకోవడంలో అక్కినేని వారసుడు విఫలమయ్యాడు.
‘అఖిల్’ డిజాస్టర్ కావడం.. ఆ తర్వాత కూడా వరుసగా ఫెయిల్యూర్లు ఎదురు కావడంతో అతడి కెరీర్ తిరోగమనంలో పయనించింది. ఈ మధ్య ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఏదో హిట్ కొట్టాను అంటే కొట్టాను అనిపించాడే తప్ప.. అందులోనూ అతను ఇంప్రెస్ చేయలేకపోయాడు. దసరా టైమింగ్, పూజా హెగ్డే ప్లస్ అయి ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడేసింది.
ఇప్పుడు అఖిల్ ఆశలన్నీ ‘ఏజెంట్’ మీదే ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో దీని చుట్టూ కొంత హైప్ కనిపిస్తోంది. ఇది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అన్న సంకేతాు కనిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం అఖిల్ ఆల్రెడీ అవతారం మార్చుకున్నాడు. విపరీతంగా కండలు పెంచి కనిపించాడు. జుట్టు కూడా పెంచాడు. ఐతే కెరీర్ ఆరంభం నుంచి అఖిల్ చాక్లెట్ బాయ్ లాగే కనిపిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ల లుక్స్ కనిపిస్తాయి అతడిలో.
ఐతే ‘ఏజెంట్’ కోసం అతడి కసరత్తులు మరీ శ్రుతి మించిపోయినట్లు కనిపిస్తోంది. అతడి చాక్లెట్ బాయ్ లుక్స్‌కు.. మరీ కండలు తిరిగిన శరీరం నప్పుతున్నట్లుగా కనిపించడం లేదు. అతడి ఫిజిక్ అబ్ నార్మల్‌గా అనిపిస్తోంది. ఒక స్థాయి వరకు బాడీ పెంచితే బానే ఉంటుంది కానీ.. మరీ జాన్ అబ్రహాం లాగా కండలు పెంచితే కష్టమే. అసలే అఖిల్ ముఖంలో హావభావాలు పలకట్లేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడిలా ఓవర్ డోస్ వర్కవుట్ల దెబ్బకు ముఖంలో జీవం పోయి, ఆమాత్రం ఎక్స్‌ప్రెషన్స్ కూడా కష్టమవుతుందేమో. యాక్షన్ మూవీ అన్నంతమాత్రాన కేవలం కండలు పెంచేస్తే సరిపోదు. దాని వల్లే సినిమా పండదు. హిట్టయిపోదు. బాడీ పెంచడం కంటే నటన పరంగా మెరుగవడం, ప్రేక్షకులను మెప్పించడంపై అక్కినేని కుర్రాడు దృష్టిపెడితే మంచిదేమో.
This post was last modified on December 27, 2021 2:24 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…