నందమూరి బాలకృష్ణ పిల్లలు ముగ్గురూ కూడా మీడియాకు చాలా దూరంగా ఉంటారు. తేజస్విని, మోక్షజ్ఞ అయితే ఇప్పటిదాకా మీడియాతో మాట్లాడిన దాఖలాలే లేవు. వాళ్లతో పోలిస్తే బ్రాహ్మణి కాస్త నయం. హెరిటేజ్ ఫుడ్స్‌ను నడిపిస్తున్న ఆమె అప్పుడప్పుడూ అయినా కాస్త మీడియాలో మాట్లాడుతుంటుంది.
తన తండ్రి 60వ పుట్టిన రోజు నేపథ్యంలో ఆమె ఓ మీడియా సంస్థతో ముచ్చటించింది. తండ్రితో ఆసక్తికర అనుభవాల గురించి ఇందులో పంచుకుంది. చిన్నపుడు తాను, తన తండ్రి కలిసి తెల్లవారుజామున హైదరాబాద్ కేబీఆర్ పార్కులు ఎలా వ్యాయామాలు చేసేవాళ్లమో ఆమె వెల్లడించింది. పార్కు ఓపెన్ చేయడానికి ముందే గేటు దూకి వాళ్లిద్దరూ లోపలికి వెళ్లేవారట.
బాలయ్య తెల్లవారుజామున మూడున్నరకే నిద్ర లేస్తాడన్న సంగతి తెలిసిందే. ఆ సమయానికే తనను కూడా నిద్ర లేపి కేబీఆర్ పార్కుకు తీసుకెళ్లేవాడని బ్రాహ్మణి తెలిపింది. అప్పట్లో తాను చాలా లావుగా ఉండేదాన్నని.. అందుకే వ్యాయామం కోసం తండ్రి తనను వెంటబెట్టుకుని వెళ్లేవాళ్లని.. ఐతే తాము వెళ్లే సమయానికి పార్కు ఓపెన్ చేసి ఉండేది కాదని బ్రాహ్మణి వెల్లడించింది.
దీంతో తనను గోడ ఎక్కించి లోపలికి వదిలిపెట్టి.. తర్వాత బాలయ్య గోడ దూకేవారని.. ఇద్దరం లోపల కసరత్తులు చేసుకుని తిరిగి బయటికి వచ్చే సమయానికి పార్కు గేటు ఓపెన్ చేసేవారని బ్రాహ్మణి తెలిపింది. తన తండ్రి నుంచి పిల్లలందరం అద్భుతమైన క్రమశిక్షణ నేర్చుకున్నామని బ్రాహ్మణి చెప్పుకొచ్చింది. ఆయన చిన్నపిల్లలతో బాగా కలిసిపోతాడని ఆమె పేర్కొంది.
This post was last modified on June 10, 2020 11:05 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…