రీసెంట్ గా విడుదలైన ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెట్టి.. 2022 దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సినిమా విడుదలైన తరువాతే బాలయ్య మరో సినిమా మొదలుపెడతారు. అంటే.. ఆయనతో సినిమా తీయాలనుకుంటున్న అనిల్ రావిపూడికి ఇంకా గ్యాప్ పెరుగుతుందన్నమాట. ఇప్పటికే బాలయ్యతో కథ ఒకే చేయించుకున్నారు ఈ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. కానీ షూటింగ్ మాత్రం ముందే పూర్తవుతుంది.
ఆ తరువాత దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. అప్పటివరకు బాలయ్య కోసం ఎదురుచూడక తప్పదు. ‘అఖండ’ సినిమా తరువాత బాలయ్య రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆయన నుంచి భారీ యాక్షన్ ఆశిస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి అనిల్ రావిపూడి కూడా తన స్క్రీన్ ప్లే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు అనిల్ తీసిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ కథలే. కానీ బాలయ్యతో తీసేది అలాంటి కథ కాదని.. పక్కా మాస్ ఫిల్మ్ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. బాలయ్యను బోయపాటి ఎంత కొత్తగా చూపించారో.. తాను కూడా అలా చూపించడానికి వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
This post was last modified on December 26, 2021 9:58 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…