Movie News

మోహన్‌లాల్.. మళ్లీ అదే రిస్క్‌

అరవయ్యొక్కేళ్ల వయసులో ఏడు సినిమాలకి ఒకేసారి పని చేస్తూ యంగ్ హీరోలను ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు మలయాళ స్టార్ మోహన్‌లాల్. ఆరట్టు, రామ్, ట్వల్త్ మేన్, బ్రో డాడీ, అలోన్, మాన్‌స్టర్‌‌, లూసిఫర్ 2 చిత్రాల్ని బ్యాక్ టు బ్యాక్ లైన్‌లో పెట్టారాయన. లూసిఫర్‌‌ 2 తప్ప మిగతావన్నీ సెట్స్‌పైనే ఉన్నాయి. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘బారోజ్‌’ని కూడా పట్టాలెక్కించారు లాల్.

‘బారోజ్: గార్డియన్ ఆఫ్ డి గామాస్‌ ట్రెజర్‌‌’ పేరుతో మోహన్‌లాల్ సినిమాని ప్రకటించి చాలా కాలమే అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ కూడా రెండేళ్ల క్రితమే మొదలైంది. ఈ యేడు మార్చ్‌లో సినిమా ప్రారంభమయ్యింది. షూటింగ్ ఇవాళ స్టార్టయ్యింది. ఈ విషయాన్ని చెబుతూ సేతు శివనందన్ వేసిన ఓ స్కెచ్‌ని రిలీజ్ చేశారు మోహన్‌లాల్. ఇది చాలా కలర్‌‌ఫుల్‌గా, అట్రాక్టివ్‌గా ఉంది. మన దేశపు మొట్టమొదటి త్రీడీ ఫిల్మ్ ‘మై డియర్ కుట్టిచేతన్‌’తో ఫేమస్ అయిన జిజో పున్నూస్ ఈ చిత్రానికి కథ అందించారు. మోహన్‌లాల్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు మూవీని డైరెక్ట్ చేస్తుండటం విశేషం. అదీ త్రీడీ ఫార్మాట్‌లో.. ప్యాన్ ఇండియా స్థాయిలో.

ఇది నాలుగొందల యేళ్ల నాటి కథ. ఓ నిధి చుట్టూ తిరుగుతుంది. అది వాస్కోడిగామా నిధి అని, దానికి బారోజ్‌ అనే వ్యక్తి సంరక్షకుడిగా ఉండేవాడని చెబుతుంటారు. ఆ బారోజ్ పాత్రలోనే లాల్ కనిపిస్తారు. రాన్ మాధవ్ అనే పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. చిన్న వయసులోనే మ్యుజీషియన్‌గా సంచలనం సృష్టించిన పదమూడేళ్ల లిడియన్ నాదస్వరం సంగీతం అందిస్తున్నాడు.

ఇదంతా ఓకే కానీ ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరంబవూర్ వంద కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారనే వార్తే కాస్త భయపెడుతోంది. ఎందుకంటే మోహన్‌లాల్ కెరీర్‌‌లో భారీ చిత్రాలు బెడిసి కొట్టడమనేది ఆనవాయితీగా వస్తోంది. మరీ ముఖ్యంగా ఇలా చరిత్రలోంచి ఏదైనా ఓ పాయింట్‌ని బైటికి లాగి తెరకెక్కించిన ఫ్యాంటసీ డ్రామాలు ఆయనకి అస్సలు అచ్చి రావట్లేదు. ఆమధ్య ఓసారి ఒడియన్ అనే సినిమా చేశారు లాల్. దానిపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా చూశాక అందరి ప్రాణాలూ ఉసూరుమన్నాయి.

మొన్నటికి మొన్న ‘మరక్కార్‌‌’ మూవీ కూడా ఇలాంటి అనుభవాన్నే మిగిల్చింది. వందల యేళ్ల క్రితం కథతో.. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ఎవరికీ సరిగ్గా అర్థమే కాలేదు. ఇప్పుడు మళ్లీ ‘బారోజ్‌’తో మరో ఎక్స్‌పెరిమెంట్‌కి రెడీ అయ్యారు లాల్. పైగా ఈసారి తనే డైరెక్టర్‌‌ చెయిర్‌‌లో కూర్చుంటున్నారు. సినిమాని అద్భుతంగా తీసి భారీ సినిమాలు తనకి కలిసి రావనే కామెంట్స్‌కి ఫుల్‌స్టాప్‌ పెడతారా లేక మరోసారి అదే చెడ్డపేరును మూట్టగట్టుకుంటారా అనేది కొన్నాళ్లు ఆగితే కానీ తెలీదు.

This post was last modified on December 26, 2021 9:42 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

1 hour ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago