‘బాహుబలి’ తర్వాత రాజమౌళి అంతే భారీ స్థాయిలో తెరకెక్కించిన తర్వాతి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకో రెండు వారాలు కూడా సమయం లేదు. ఈ సినిమాకు ఆల్రెడీ ఓవర్సీస్‌లో బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. వారం కిందట్నుంచే బుకింగ్స్ నడుస్తున్నాయి. విడుదలకు రెండు వారాల సమయం ఉండగానే, ప్రి సేల్స్‌తోనే ఈ చిత్రం మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటేసింది. ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో థియేటర్లు కూడా ఖరారయ్యాయి.
దాదాపుగా అన్ని థియేటర్లకూ అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సినిమాకు థియేటర్ల బుకింగ్ పూర్తయింది. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవు కాబోతున్నాయి. చిత్ర బృందం ఇండియాలో వివిధ ప్రాంతాల్లో తిరిగేస్తూ సినిమాను తెగ ప్రమోట్ చేసేస్తోంది కూడా. అంతా బాగుంది కానీ.. విడుదలకు సమయం దగ్గర పడుతున్న ఈ టైంలో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌పై సందేహాలు నెలకొంటున్నాయి.
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో మళ్లీ ఆంక్షలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. కర్ణాటక ఆల్రెడీ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో కూడా ఆంక్షలు పెడుతున్నారు. కాకపోతే ఇంకా నైట్ షోలు రద్దు చేయలేదు. క్రిస్మస్ వీకెండ్లో సినీ వినోదానికి బ్రేక్ వేయకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి వేచి చూసే దోరణలో వ్యవహరిస్తున్నాయి రాష్ట్రాలు.
కానీ వచ్చే వారం నుంచి ఆంక్షలు తప్పకపోవచ్చని అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో నైట్ షోలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం లాంఛనమే అని వార్తలొస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాట పట్టొచ్చు. ఇదే జరిగితే ‘ఆర్ఆర్ఆర్’కు ఇబ్బంది తప్పదు. నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో, రెగ్యులర్ షోలన్నీ పడితే తప్ప ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రానికి వర్కవుట్ కాదు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత పెరిగి, ఆంక్షలు మొదలైతే ‘ఆర్ఆర్ఆర్’ను చివరి నిమిషంలో వాయిదా వేసే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
This post was last modified on December 25, 2021 3:13 pm
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇప్పటికైతే హరిహర వీరమల్లునే. ఇందులో అనుమానం…
తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు.…
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…