బాహుబలి దగ్గర్నుంచి ప్రభాస్ సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండట్లేదు. అతను ఆషామాషీ సినిమాలు చేస్తే అభిమానులు ఒప్పుకునే పరిస్థితి లేదు. అతడి ఇమేజ్‌కు తగ్గట్లుగా తెరపై అద్భుతాలను ఆవిష్కరించాల్సిందే. బాహుబలి తర్వాత చేసిన సాహో సినిమాలో యాక్షన్ పరంగా గట్టిగానే ట్రై చేశారు కానీ.. ఆసక్తికరమైన కథాకథనాలు లేకపోవడంతో ఆ చిత్రం ప్రభాస్ అభిమానులనే కాక అందరినీ నిరాశకు గురి చేసింది.
ఇప్పుడిక ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ రాధేశ్యామ్ మీదే ఉన్నాయి. ఈ చిత్రమైనా ప్రభాస్ ఇమేజ్‌ను మ్యాచ్ చేసేలా ఉంటుందేమో అని చూస్తున్నారు. కానీ ట్రైలర్ చూశాక వారి నుంచి ఒకింత నిరాశే వ్యక్తమవుతోంది. దీంతో పోలిస్తే సాహోనే బెటర్ అనే అభిప్రాయం మెజారిటీ ప్రభాస్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అందుక్కారణం అందులో హీరో ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు ఒక రేంజిలో ఉండటమే కారణం.
రాధేశ్యామ్ విషయానికి వస్తే ఇందులో ప్రభాస్ నుంచి కోరుకునే ఎలివేషన్లేమీ ఉండేలా కనిపించడం లేదు. ఇది యాక్షన్ సినిమా కాదు. క్లాస్ టచ్ ఉన్న పక్కా లవ్ స్టోరీ అనే సంకేతాలు ముందు నుంచే వస్తున్నాయి. అయినప్పటికీ.. ఎంతో కొంత హీరో ఎలివేషన్ ఉంటుందనుకున్నారు. కొన్ని హై మూమెంట్స్ ఆశించారు. ట్రైలర్లో అలాంటి విశేషాలు తప్పక ఉంటాయన్న ఆశతో ఎదురు చూశారు. కానీ ట్రైలర్లో అలాంటి మెరుపులేమీ కనిపించలేదు. హీరోను జ్యోతిషుడిగా చూపించి ప్రపంచంలోనే అతడిలాంటి ఆస్ట్రాలజర్ లేడు అంటే అభిమానులకు ఏం కిక్కుంటుంది.
గాఢమైన ప్రేమకథను ఎమోషన్లతో.. పూర్తి క్లాస్‌గా చెప్పే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు రాధాకృష్ణకుమార్. ఈ స్టైల్ నరేషన్ మాస్‌కు అస్సలు రుచించదు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ చూస్తేనే చాలా మందికి ల్యాగ్ అనిపించింది. మరి ప్రభాస్ సినిమాలో హీరో ఎలివేషన్లు, మాస్ అంశాలు, యాక్షన్ ఘట్టాలు ఏమీ లేకుండా ఇలాంటి కథతో, నరేషన్‌తో ఇలాంటి నరేషన్‌తో రెండున్నరమూడు గంటల సినిమా అంటే ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఏమో?
This post was last modified on December 24, 2021 9:44 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…