అన్నప్రాసన రోజే ఆవకాయ అనే సామెత సంగతి తెలిసిందే. ఏదైనా పని మొదలుపెట్టినపుడు ఆరంభంలోనే మోతాదు ఎక్కువైతే ఈ సామెత వాడుతుంటాం. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లోనూ ఇదే జరిగిందట. మామూలుగా ఒక సినిమా షూటింగ్ ఆరంభం అయినపుడు తొలి వారం రోజుల్లో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేని చిన్న చిన్న సన్నివేశాలు తీస్తుంటారు. తమ పాత్రలకు కాస్త అలవాటు పడ్డాక ఇంటెన్సిటీ పెంచి పెద్ద స్థాయి సన్నివేశాలు తెరకెక్కిస్తారు.
ఐతే రాజమౌళి దీనికి భిన్నంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆరంభమైన రెండో రోజే హీరోలతో భారీ విన్యాసాలు చేయించాడట. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు తాడు కట్టి 60 అడుగుల ఎత్తులోకి పంపించాడట. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఇదంతా చేయించాడట.
ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ ప్రమోషన్లలో భాగంగా ఒక కార్యక్రమంలో దీని గురించి రాజమౌళి, తారక్, చరణ్ మాట్లాడారు. మామూలుగా షూటింగ్ ఆరంభంలో చిన్న చిన్న సన్నివేశాలు తీయడం ఆనవాయితీ అని, కానీ ఈ సినిమాకు మాత్రం తన హీరోలతో సాహసోపేత విన్యాసాలు చేయించానని స్వయంగా రాజమౌళే వెల్లడించాడు. ఇద్దరికీ తాళ్లు కట్టించి 60 అడుగుల ఎత్తుకు పంపించినట్లు చెప్పాడు.
ఇంతలో తారక్ అందుకుని రెండో రోజు ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తే.. తొలి రోజేమీ తమను ఖాళీగా ఉంచలేదని.. ఈ సన్నివేశాల కోసం రాజమౌళి రిహార్సల్స్ చేయించాడని తెలిపాడు. తాను తాడు కట్టుకుని 60 అడుగుల ఎత్తులో ఉండగా.. పది నిమిషాలు లేటుగా సెట్‌కు వచ్చిన చరణ్ తనను చూసి ఆశ్చర్యపోయాడని అన్నాడు. ఈ సన్నివేశాల చిత్రీకరణ తర్వాత తమ ఇద్దరికీ బరువులు కట్టి 20 అడుగుల నీటి లోతులోకి పంపించారని.. చరణ్‌కు ఇలాంటివి అలవాటే కానీ.. తనకు కాదని, దీంతో ఇబ్బంది పడ్డానని తారక్ వెల్లడించాడు.
This post was last modified on December 23, 2021 10:55 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…