బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ ‘ధోనీ’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంది. యూత్ లో ఈమెకి ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ బిజీ అయింది. మధ్యలో రామ్ చరణ్ తో ‘వినయ్ విధేయ రామ’ సినిమా చేసింది కానీ వర్కవుట్ అవ్వలేదు.
దీంతో బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. ఆమె నటించిన ‘కబీర్ సింగ్’ సినిమా రెండొందల కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవలే ‘షేర్షా’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కియారా చాలా కాలంగా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.
వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు, పార్టీలకు వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఎప్పుడూ కూడా ఈ జంట తమ రిలేషన్ గురించి బయట ఎక్కడా మాట్లాడలేదు. త్వరలోనే తన లవ్ లైఫ్ గురించి పబ్లిక్ గా చెప్పాలని నిర్ణయించుకుందట కియారా అద్వానీ.
2022 న్యూ ఇయర్ సందర్భంగా సిద్ధార్థ్ తో ప్రేమాయణం గురించి అభిమానులతో షేర్ చేసుకోబోతుంది కియారా. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే తమ బంధాన్ని బయటకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం కియారా.. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on December 23, 2021 5:07 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…