Political News

ఎంపీపై మండిపోతున్న తమ్ముళ్ళు

విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తమ్ముళ్ళు మండిపోతున్నారు. ఇంతకాలం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను చూస్తున్న నేతలను తప్పించి చంద్రబాబునాయుడు కొత్తగా ఎంపీకీ అప్పగించటాన్ని తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే చంద్రబాబు నిర్ణయంతో పాటు నియమితుడైన ఎంపీ మీద కూడా తమ్ముళ్ళు మండిపోతున్నారు. తాజాగా మొదలైన వివాదానికి పెద్ద చరిత్రమే ఉంది.

విజయవాడలో ఎంపీ నాని అంటే మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, సీనియర్ నేత నాగుల్ మీరా వర్గాలకు ఏమాత్రం పడదు. విషయం ఏదైనా వీళ్ళమధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగే ఉంటుంది. వీళ్ళమధ్య సయోధ్య చేద్దామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు చాలాసార్లు ఫెయిలయ్యాయి. ఇలాంటి నేపధ్యంలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతలను చంద్రబాబు ఎంపీకి అప్పగించారు.

గడచిన రెండున్నరేళ్ళుగా ఈ బాధ్యతలను బుద్దా, నాగుల్ జాయింట్ గానే చూస్తున్నారు. అలాంటిది చెప్పా పెట్టకుండా వీళ్ళద్దరిని మార్చేసి కొత్తగా ఎంపీకి బాధ్యతలు ఎందుకిచ్చారో ఎవరికీ అర్ధం కావటంలేదు.  చంద్రబాబు నిర్ణయం బయటకు రాగానే ఎంపీ వ్యతిరేకవర్గం ఒక్కసారిగా మండిపోయింది. పార్టీ ఆఫీసుముందు రచ్చ రచ్చ చేశారు. అలాగే బుద్ధా ఇంట్లో సమావేశమైన నేతలు, కార్యకర్తలు చంద్రబాబు, ఎంపీ వైఖరిపై మండిపోయారు.

పై రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చాలా తీవ్రంగా నడుస్తోంది. అలాంటిది రెండువర్గాలను కాదని చంద్రబాబు కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగించుంటే బాగుండేది. కనీసం కొంతకాలమైనా రెండువర్గాలు ప్రశాంతంగా ఉండేవి. అయితే చంద్రబాబు అలా చేయకుండా కొంతకాలం ఒక వర్గానికి ఇంకొంత కాలం మరోవర్గాన్ని దగ్గరకు తీసుకుంటున్న కారణంగా రెండు వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయే కానీ తగ్గటంలేదు.

అసలు కేశినేని పార్టీలో అనుమానమని ఆమధ్య జరిగిన ప్రచారం అందరికీ తెలిసిందే. చంద్రబాబుతో కాదు ఏకంగా పార్టీ కార్యక్రమాలతో కూడా చాలాకాలం సంబంధం లేకుండానే ఉన్నారు. అలాంటిది కొంతకాలంగా చంద్రబాబుకు దగ్గరయ్యారు. దీంతో ఆయన వ్యతిరేకవర్గం మండిపోతోంది. ఇష్టం లేనపుడు పార్టీకి దూరంగా జరగటం, ఇష్టం ఉన్నపుడు మళ్ళీ పార్టీలో కనబడటం ఏమిటంటు వ్యతిరేకవర్గం ఎంపీని నిలదీస్తోంది. అయినా చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండానే ఇపుడు ఎంపీకి బాధ్యతలు అప్పగించారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on December 23, 2021 3:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

6 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

6 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

7 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

7 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

9 hours ago