రామ్ గోపాల్ వర్మ పేరెత్తితే ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ కూడా చిరాకు పడిపోయే పరిస్థితి ఎప్పుడో వచ్చేసింది. ఆయన సినిమాల క్వాలిటీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రభావితం చేసే క్లాసిక్స్ అందించిన ఆయన.. ఇప్పుడు మరీ నాసిరకం, బి-గ్రేడ్ సినిమాల స్థాయికి పడిపోవడం విచారకరం.
ఐతే దీని గురించి సినీ జనాలు, అభిమానులు, విశ్లేషకులు ఫీలవ్వాల్సిందే తప్ప వర్మకు కొంచెం కూడా రిగ్రెట్ లేదు. తాను చేస్తున్న సినిమాల పట్ల ఆయన చాలా సంతృప్తిగా ఉన్నాడు. ఎలాగోలా సినిమాను సేల్ చేసుకోవడమే ఆయన లక్ష్యంగా ఉంటోంది. ఈ లక్ష్యంతోనే ఈ మధ్య ‘క్లైమాక్స్’ అనే మరో పేలవమైన సినిమా తీశాడు. దాన్ని ఉన్నంతలో బాగానే సేల్ చేశాడు. రూ.100 రేటు పెట్టి తన పేరిటే పెట్టిన సొంత ఆన్ లైన్ థియేటర్లో రిలీజ్ చేసి కొన్ని కోట్లు ఖాతాలో వేసుకున్నాడు వర్మ.
ఆర్జీవీ లెక్కల్లో ‘క్లైమాక్స్’ సూపర్ హిట్టయింది. ఈ ఉత్సాహంతో ఆయన ‘నేక్డ్’ పేరుతో మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అనౌన్స్‌మెంట్ రోజే ట్రైలర్ కూడా లాంచ్ చేశాడు. ‘క్లైమాక్స్’ కోసం మియా మాల్కోవాను తీసుకొచ్చిన వర్మ.. ఈసారి ఎవరో లోకల్ అమ్మాయితోనే ఈ సినిమా తీశాడు. దీని ట్రైలర్ కూడా లాంచ్ చేశాడు. అది వర్ణించతరం కాని విధంగా ఉంది. ఆ విజువల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ‘క్లైమాక్స్’ సినిమాకు 100 రూపాయల రేటే ఎక్కువనుకుంటే.. దీనికి ‘పే పవర్ వ్యూ’ కింద రూ.200 చెల్లించాలట. ఇది కూడా త్వరలోనే ఆర్జీవీ థియేటర్లోనే రిలీజవుతుందట. ఫారిన్ అమ్మాయిని చూడటానికి రూ.100 టికెట్ రేటు పెట్టి.. ఈసారి రూ.200 రేటు నిర్ణయించడానికి కారణం స్థానిక అమ్మాయిలపై తనకున్న ప్రత్యేక గౌరవమే కారణమంటూ తనదైన శైలిలో లాజిక్ తీశాడు వర్మ.
This post was last modified on June 9, 2020 4:47 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…