టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కొన్ని హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయినప్పటికీ.. స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా పెరిగినప్పటికీ.. మెహ్రీన్ కి అవకాశాలు మాత్రం వస్తున్నాయి. ఈ ఏడాది ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా మెహ్రీన్ కి టాలీవుడ్ లో ఓ సినిమా ఆఫర్ రాగా.. మరో ఆలోచన లేకుండా నో చెప్పేసిందట.
దానికి కారణమేంటంటే.. కథ ప్రకారం సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయట. కిస్ సీన్స్ తో పాటు బెడ్ రూమ్ సీన్స్ కూడా ఉండడంతో వెంటనే నో చెప్పిందట.
నిజానికి మెహ్రీన్ వెండితెరపై గ్లామరస్ రోల్స్ లో కనిపించింది. ‘ఎఫ్2’ సినిమాలో బికినీ కూడా వేసింది. కానీ ఇంటిమేట్ సీన్ల విషయంలో మాత్రం కొన్ని లిమిట్స్ పెట్టుకుందట. అందుకే తనకొచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బోల్డ్ యాక్ట్రెస్ ఫేమ్ తనకొద్దని ఫిక్స్ అయింది మెహ్రీన్.
ప్రస్తుతం ఈ బ్యూటీ అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తోంది. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రావాల్సివుంది కానీ ఇప్పుడు వాయిదా పడింది. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
This post was last modified on December 22, 2021 6:09 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…