మెగాస్టార్ చిరంజీవితో అల్లు అర్జున్ సంబంధాల మీద సందేహాలు రేకెత్తించేలా ఈ మధ్య తరచుగా ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. ఇంతకుముందులా బన్నీ ‘మెగా’ జపం చేయట్లేదు. చిరంజీవి లేకుండా నేను లేను అనే మాట అనట్లేదు. సాధ్యమైనంత వరకు ‘మెగా’ ముద్రను తొలగించుకోవడానికి.. సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు.
‘అల వైకుంఠపురములో’ ఆడియో వేడుకలో.. తన ‘ఆర్మీ’కి ఏ రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడో తెలిసిందే. అక్కడ ‘చిరు’, ‘మెగా’ మాటలే వాడలేదసలు. ఇక ఆ సినిమా నాన్-బాహుబలి హిట్ అయిన నేపథ్యంలో బన్నీ మరింతగా మెగా ముద్రకు దూరం జరుగుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతను చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
బన్నీ అభిరుచుల గురించి ఓ పత్రిక వీక్లీలో ఆర్టికల్ వేశారు. అందులో బన్నీ తనకు నచ్చిన డ్యాన్సర్ గురించి చెప్పాడు. ఇండియాలోనే నంబర్ వన్ డ్యాన్సర్ అనిపించుకున్న చిరంజీవి తన ఫ్యామిలీలోనే ఉండగా.. అతను తన ఫేవరెట్ డ్యాన్సర్ గోవిందా అని చెప్పడం గమనార్హం. గోవిందా స్టెప్పులేస్తుంటే చూపు తిప్పుకోలేనంటూ బన్నీ వ్యాఖ్యానించాడు.
గోవిందానే తనకు డ్యాన్సుల్లో చిరంజీవి ఆదర్శం అన్నాడు. గోవిందాతో పోలిస్తే చిరు డ్యాన్సుల్లో ఎన్నో మెట్లు పైన ఉంటాడు. మరి చిరు కాకుండా గోవిందా తనకు నచ్చిన డ్యాన్సర్ అనడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. చిరు డ్యాన్సుల గురించి గతంలో ఎంతగానో పొగిడి ఆయనే తనకు ఇన్‌స్పిరేషన్ అన్న బన్నీ.. ఇప్పుడు కొత్తగా గోవిందా పేరు చెప్పాడేంటని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.
అలాగే ఇన్‌స్పిరేషన్ ఎవరు అంటే కూడా అమితాబ్ బచ్చన్ పేరే చెప్పాడు ఈ ఇంటర్వ్యూలో బన్నీ. ఇక్కడా చిరు పేరు ప్రస్తావించకపోవడాన్ని చిరు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. చిరు పేరు చెప్పుకుని ఎదిగిన బన్నీ.. ఇప్పుడు పెద్ద స్థాయికి చేరుకున్నాక ఉద్దేశపూర్వకంగానే చిరు పేరును అవాయిడ్ చేస్తున్నాడన్నది వారి ఆరోపణ.
This post was last modified on June 9, 2020 4:48 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…