సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్స్ అంటే ముందుగా.. యాంకర్ సుమని సంప్రదిస్తారు. అందులోనూ.. భారీ బడ్జెట్ సినిమా ఈవెంట్స్ అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. లక్షన్నర నుంచి రెండు లక్షలు ఆమెకి రెమ్యునరేషన్ గా ఇచ్చి హోస్ట్ చేయిస్తుంటారు. పైగా.. ఇండస్ట్రీ జనాలపై పంచ్ లు, కౌంటర్లు వేసేంత ఫ్రీడమ్ యాంకర్లలో అంటే సుమకి మాత్రమే ఉంటుందని చెప్పాలి.
మిగిలిన వాళ్లు ఈ విషయంలో కాస్త ఇబ్బందిపడతారు. అయితే ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మాత్రం సుమను తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈసారి ప్రభాస్ టీమ్ కొత్తగా ట్రై చేస్తుందట. టాలీవుడ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని ‘రాధేశ్యామ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి యాంకర్ గా ఫిక్స్ చేశారట.
ప్రభాస్ తో, యువి బ్యానర్ తో ఉన్న అనుబంధంతో నవీన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని నవీన్ పోలిశెట్టిని రంగంలోకి దింపారు. నవీన్ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే.. తన పంచ్ లు, కామెడీతో ఈవెంట్ ని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చడం ఖాయం. నవీన్ పోలిశెట్టితో పాటు హాట్ యాంకర్ రష్మీ కూడా హోస్ట్ గా కనిపిస్తుందట. నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on December 22, 2021 2:38 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…