మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్ రాజా రూపొందిస్తోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమార్ పోషించిన పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడని సమాచారం. తన ఇన్నేళ్ల కెరీర్ లో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ కూడా తెలుగు సినిమాల్లో నటించలేదు. తొలిసారి చిరంజీవి మీద ఉన్న అభిమానంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
సినిమాలో సల్మాన్ రోల్ చిన్నదే అయినా.. చాలా ఎఫెక్టివ్ గా చూపించబోతున్నారట. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించినట్లు తెలుస్తోంది. 2022 ఫిబ్రవరిలో షూటింగ్ పెట్టుకోమని చెప్పారట సల్మాన్. దానికి తగ్గట్లుగానే మిగిలిన నటీనటుల డేట్స్ ని అడ్జస్ట్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.
ఈ సినిమాలో నయనతార మరో కీలకపాత్రలో కనిపించనుంది.
ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’, దర్శకుడు బాబీ రూపొందిస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి. రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఫ్యూచర్ లో ఆయన మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నారు.
This post was last modified on December 22, 2021 8:32 am
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…