బిగ్ బాస్ సీజన్ 5 సందడి ముగిసింది. అంచనాలకు ఏ మాత్రం మిస్ కాకుండా విజేతగా సన్నీ టైటిల్ సొంతం చేసుకుంటే.. రన్నర్ గా షణ్నూ నిలిచారు. గ్రాండ్ ఫినాలే వేళ.. టాప్ 5లో నిలిచిన ఐదుగురిలో మొదటి ఎవిక్షన్ సిరితో స్టార్ట్ అయ్యింది. పటాకా ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ ఎవరంటే.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా సిరి పేరే ఎవరైనా చెబుతారు. టాస్కుల వేళ.. అబ్బాయిలకు ఏ మాత్రం తగ్గకుండా.. వారి బలం ముందు తనది పిట్ట బలమని తెలిసినా.. తాను ఫైట్ చేసే తీరు అందరికి నచ్చుతుంది.
షణ్నుతో ఉన్న కెమిస్ట్రీ విషయంలో ఆమె కాస్తంత బ్యాడ్ అయ్యారు. షణ్నూ.. జెస్సీ.. సిరిలతో కూడిన ఫ్రెండ్ షిప్ క్యూట్ గా సాగటం తెలిసిందే. అయితే.. ఆ సందర్భంలోనూ సిరి.. షణ్నుల మధ్య బంధం గాఢంగానే కాదు.. శ్రుతిమించిన పరిస్థితి.
ఈ ఒక్క పాయింట్ ను వదిలేస్తే.. టైటిల్ విజేతకు అన్ని అర్హతలున్న అమ్మాయిగా సిరిని చెప్పాలి. ఇప్పటికి సాగిన నాలుగు సీజన్లలో విజేతగా ఒక్క అమ్మాయి లేకపోవటం.. టైటిల్ విన్నర్ గా ఈసారైనా అమ్మాయికే దక్కుతుందన్న ఆశ.. నిరాశగా మారింది.
సీజన్ 5లో బిగ్ బాస్ హౌస్ భావోద్వేగాల నిధి అయితే.. అందులో సిరివి నీవంటూ ఎవరికి కనిపించని బిగ్ బాస్ ఆమెపై కురిపించిన పొగడ్తల జల్లు కురిపించటం తెలిసిందే. ముఖంపై చెరగని చిరునవ్వు.. లెక్క తేడా వస్తే ముఖం పగిలిపోయేలా పంచ్ లు వేయటమే కాదు.. తాను అభిమానించే షణ్ను కోసం తరచూ కిందకు దిగటం.. డౌన్ కావటం కనిపిస్తాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమె నేపథ్యం అందరిని టచ్ చేస్తుంది. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. వినోదాత్మక రంగంలో.. అందులోనూ గ్లామర్ ఇండస్ట్రీలో తాను చిన్నతనం నుంచి అమ్మ చేసే బిజినెస్ లో తోడు ఉండేదానినని.. వినాయకచవితికి గణేశ్ విగ్రహాలు అమ్మేదానినని.. అంటూ ఓపెన్ గా చెప్పేసే ఈ విశాఖపట్నం అమ్మాయి.. అందరి మనసుల్ని దోచుకుందని చెప్పాలి.
ఈ బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5గా నిలిచిన సిరి.. ఎవిక్షన్ అయినప్పటికీ.. ముందుగా షో నిర్వహాకులతో ఆమె చేసుకున్న ఒప్పందం ప్రకారం భారీగానే రెమ్యునరేషన్ దక్కినట్లుగా చెబుతున్నారు. ట్రోఫీ విజేతగా నిలవనప్పటికీ.. వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయిల వరకు ఇస్తామని ఆమెకు ఆఫర్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఒక వాదన వినిపిస్తోంది. ఈ లెక్కన చూసినప్పుడు పదిహేను వారాలకు సుమారు ఆమెకు రూ.25 లక్షల మేర పారితోషికం అందినట్లుగా చెబుతున్నారు. ట్రోఫిని సొంతం చేసుకోనప్పటికీ.. విజేతకు దక్కే మొత్తంలో సగ భాగం సిరికి రెమ్యునరేషన్ దక్కినట్లుగా చెప్పాలి. ఏమైనా.. బిగ్ బాస్ సీజన్ 5 అన్నంతనే గుర్తుకు వచ్చే ఇద్దరు.. ముగ్గురిలో సిరి ఒకరు ఉంటారని చెప్పక తప్పదు.
This post was last modified on December 21, 2021 1:28 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…