సాయిధరమ్ తేజ్ కెరీర్ ఆరంభం నుంచి ఎప్పటికప్పుడు గట్టి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అతడి తొలి సినిమా ‘రేయ్’తో కంగుతిన్నాడు. ఆ సినిమా ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోకపోవడం.. దీంతో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ పేరుతో మరో సినిమా మొదలుపెట్టి దాన్నే ముందు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత రిలీజైన ‘రేయ్’ అంచనాలకు తగ్గట్లే చతికిలపడింది.
ఆపై సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీత్ సినిమాలతో మాంచి ఊపు మీద కనిపించాడు తేజు. ఇక అతను మరో రేంజికి వెళ్లిపోతాడనుకుంటే.. వరుసగా ఒకటి రెండు కాదు.. అరడజను ఫ్లాపులతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఓ మోస్తరు విజయం కోసం అతను తహతహలాడిపోయే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను పూర్తి నైరాశ్యంలో ఉన్న టైంలో పూర్తిగా అవతారం మార్చి, తన శైలికి భిన్నంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేసిన ‘చిత్రలహరి’ కాస్త ఉపశమనాన్ని అందించింది.
ఆపై ‘ప్రతి రోజూ పండగే’ లాంటి ఎంటర్టైనర్‌తో పెద్ద విజయాన్నే అందుకున్నాడు. ఈ ఉత్సాహంలో రొటీన్‌కు భిన్నంగా, ప్రయోగాత్మకంగా, సందేశంతో ముడిపడ్డ ‘రిపబ్లిక్’ చేశాడు తేజు. ఐతే అతడి సాహసానికి తగిన బాక్సాఫీస్ ఫలితం దక్కలేదు. మంచి సినిమానే అయినా ఇది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. చిత్ర బృందం దీన్ని గొప్ప సినిమాగా ప్రమోట్ చేసుకుంటున్నా.. ఓటీటీలో దీనికి మంచి స్పందనే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఇది పెద్ద ఫెయిల్యూర్ అనడంలో సందేహం లేదు. దీంతో తేజు ఒక్కసారిగా రూటు మార్చేశాడు.
ఇలాంటి ప్రయోగాలు ఇక నడవవని పక్కా మాస్ మసాలా మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. అతను మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన సంపత్ నందితో సినిమా చేయబోతున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోందీ చిత్రాన్ని. ‘రిపబ్లిక్’ ఫలితానికి తోడు.. అఖండ, పుష్ప లాంటి మాస్ చిత్రాలకు దక్కుతున్న ఆదరణ చూశాక తేజు మరో రిస్క్ చేయడానికి రెడీగా లేనట్లున్నాడు. కెరీర్ మరోసారి ప్రమాదంలో పడేలా ఉండటంతో రిస్క్ లేకుండా మాస్ సినిమా చేయాలని ఫిక్సయినట్లున్నాడు. మరి ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on December 20, 2021 4:35 pm
గతంలో హీరోగా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించిన కమెడియన్ సప్తగిరి.. చివరగా లీడ్ రోల్ చేసిన రెండు మూడు సినిమాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన తెలంగాణ నేత, హైదరాబాద్ పాత బస్తీ పరిధి గోషా మహల్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న…
ఏపీ విపక్షం వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నచందంగా పరిస్థితి మారిపోయింది. అసెంబ్లీ లో ఆ పార్టీకి 11…
రాజకీయాల్లో నాయకుల ప్రతిభ, ఎత్తులు పై ఎత్తులు.. ఎన్ని ఉన్నా చివరాఖరుకు.. సామాజిక వర్గాల దన్ను, వారి మద్దతు లేకుండా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ అధినేత వైైఎస్ జగన్…
సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఏకంగా ఒక సినిమా ప్రమోషన్ ఎలా ఉండాలో సూచించే స్థాయికి వెళ్ళిపోయింది.…