‘ఆహా’ కోసం నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షో చేస్తున్నాడన్నపుడు అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. ముందసలు ఈ విషయాన్ని నమ్మలేదు. బాలయ్య ఏంటి మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్ నడుపుతున్న ఓటీటీకి షో చేయడమేంటి అనుకున్నారు. కానీ తర్వాత అదే నిజమని తేలింది. ‘ఆహా’ కోసం బాలయ్యను అరవింద్ భలే వాడేసుకుంటున్నారే అనుకున్నారు.
‘ఆహా’కు బాలయ్య షో ఎంతగానో ఉపయోగపడ్డ మాట వాస్తవం. ఈ షో వల్ల సబ్‌స్క్రిప్షన్లు పెద్ద సంఖ్యలోనే పెరిగినట్లు తెలుస్తోంది. ‘ఆహా’కు పాపులారిటీ పెంచడంలో, సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చ జరిగేలా చేయడంలో బాలయ్య షో కీలక పాత్ర పోషించింది. ఐతే ఈ షో వల్ల బాలయ్యకు కూడా మంచి లాభమే దక్కిందన్నది స్పష్టం. లాభం అంటే.. అది కేవలం ఆర్థిక రూపంలో మాత్రమే కాదు.. ఇమేజ్ పరంగా.
బయట ఏదైనా వేదికలెక్కినా.. ఇంకెక్కడైనా బాలయ్య మాట్లాడ్డానికి ఎంత తడబడతాడో తెలిసిందే. తన మీద తనకు కంట్రోల్ ఉండదని.. తన మాటల మీదా నియంత్రణ ఉండదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. కానీ ‘అన్ స్టాపబుల్’ షోలో మాత్రం బాలయ్యలో ఆ తడబాటే కనిపించడం లేదు. ఇక షో ఆద్యంతం చాల కూల్‌గా, తడబాటు లేకుండా.. చాలా సరదాగా ఆయన హోస్ట్ చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బాలయ్యలోని బోళాతనం కనిపిస్తూనే లౌక్యం కూడా అగుపిస్తోంది చాలా చోట్ల.
చిరంజీవితో తన అనుబంధం గురించి.. తెలుగుదేశం పార్టీ పగ్గాలు తాను చేపట్టకపోవడం గురించి.. అలాగే చంద్రబాబు తన తండ్రికి వెన్నుపోటు పొడిచాడనే విషయంలో బాలయ్య తన మనసులో మాటల్ని ఈ షో ద్వారా చెప్పుకోగలిగాడు. ఆ రకంగా జనాలకు, ఆయనకు మధ్య ఉన్న ఒక అంతరం తొలగిపోయింది. వివిధ అంశాల్లో బాలయ్య ఒపీనియన్ ఏంటో జనాలకు తెలిసింది. ఇదిలా ఉంటే బాలయ్య సేవా భావం ఈ షోలో బాగా హైలైట్ అవుతోంది. బసవతారకం హాస్పిటల్ ద్వారా.. వేరే రకమైన సేవా కార్యక్రమాల ద్వారా బాలయ్య ఎంత దాతృత్వం ప్రదర్శిస్తున్నాడో ఈ షోలో అందరికీ అర్థమవుతోంది. ఈ రకంగా ‘అన్ స్టాపబుల్’ షో బాలయ్య మంచి ప్రయోజనాన్నే కలిగిస్తోంది.
This post was last modified on December 19, 2021 7:40 pm
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…