శుక్రవారం భారీ అంచనాల మధ్య రిలీజైన ‘పుష్ప’ సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. ఉదయం షోలు అయ్యేసరికి కొందరు సినిమా బాగుందన్నారు. కొందరు బాలేదన్నారు. కొందరేమో మధ్య రకంగా మాట్లాడారు. కానీ సాయంత్రానికి నెగెటివ్ టాకే ఎక్కువగా వినిపించింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు చోట్లా నెగెటివిటీనే ఎక్కువగా కనిపించింది. రివ్యూల విషయానికి వచ్చినా ‘పుష్ప’ గురించి ఎక్కువగా ప్రతికూలంగానే స్పందించారు.
ఎవ్వరూ ఫుల్ పాజిటివ్ రివ్యూలైతే ఇవ్వలేదు. ముందు రోజే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరగడం వల్ల తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లకైతే ఢోకా లేదు. సినిమా పట్ల ప్రేక్షకుల అసలు స్పందన ఎలా ఉందన్నది సోమవారానికి స్పష్టంగా తెలియవచ్చు. ప్రస్తుతానికైతే టాక్, రివ్యూలన్నీ ‘పుష్ప’కు ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి.ఐతే తెలుగుతో పోలిస్తే.. ‘పుష్ప’కు తమిళం, మలయాళంలో స్పందన చాలా మెరుగ్గా కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఈ సినిమా నేటివిటీ పరంగా చూసినా, అభిరుచి కోణంలో చూసినా వాళ్లకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ‘పుష్ప’కు తమిళం, మలయాళంలో చాలా వరకు పాజిటివ్ రివ్యూలు రావడం విశేషం. 3, 3 ప్లస్ రేటింగ్స్‌లో రివ్యూలు వచ్చాయి అక్కడ. ఇందులో కొన్ని పెయిడ్ రివ్యూలు ఉండొచ్చు గాక.. కానీ న్యూట్రల్‌గా ఉండే సమీక్షకులు, వెబ్ సైట్లు కూడా ఈ సినిమాకు తమిళం, మలయాలంలో పాజిటివ్ రివ్యూలివ్వడం గమనార్హం.
హిందీలో ఈ పరిస్థితి లేదు. అక్కడ ఎక్కువగా నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. ‘పుష్ప’ తరహా రస్టిక్, రగ్డ్ మూవీస్‌తో తమిళ, మలయాళ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. నిజానికి ఆ రెండు భాషల్లోనే ఎక్కువగా అటవీ నేపథ్యంలో, డీగ్లామర్ లీడ్ క్యారెక్టర్లతో ఇలాంటి సినిమాలు ఎక్కువగా తీస్తుంటారు. వీటికి అక్కడి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంటారు. ‘పుష్ప’కు అలాగే కనెక్ట్ అవుతున్నట్లున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో తొలి రోజు ‘పుష్ప’కు మంచి వసూళ్లు కూడా వచ్చాయి.
This post was last modified on December 18, 2021 8:25 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…