Movie News

స్పైడర్ మ్యాన్ దంచేశాడుగా..

హాలీవుడ్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడం కొత్తేమీ కాదు. రెండేళ్ల కిందట ‘ఎవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమా రిలీజైనపుడు ఏ స్థాయి హంగామా నెలకొందరో అందరూ చూశారు. ఇండియాలో రిలీజయ్యే పెద్ద సినిమాలకు దీటుగా ఆ చిత్రానికి అడ్వాన్ బుకింగ్స్ జరిగాయి. కళ్లు చెదిరే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రభావం చూపిస్తున్నది ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ మూవీనే.

ఈ గురువారం రిలీజైన ‘స్పైడర్ మ్యాన్’ కొత్త వెర్షన్ భారతీయ బాక్సాఫీస్‌ను దున్నేస్తోంది. తొలి రోజు రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 3300 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా.. అన్ని చోట్లా హౌస్ ఫుల్ వసూళ్లతో ఆడేసింది. సినిమాకు మంచి టాక్ కూడా రావడంతో బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. తొలి రోజు ‘స్పైడర్ మ్యాన్’ ఇండియాలో ఏకంగా 36 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందీ చిత్రం. ఇండియాలో ఈ ఏడాదికి ఇదే హెయెస్ట్ గ్రాసర్ అని ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు.

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో.. అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్ ప్రత్యేక పాత్రలు పోషించిన ‘సూర్యవంశీ’ సినిమా సైతం ఇండియాలో తొలి రోజు 25 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. అలాంటిది ‘స్పైడర్ మ్యాన్’ దాని కన్నా పది కోట్ల పైగానే వసూళ్లు తెచ్చుకుందంటే బాక్సాఫీస్ దగ్గర దీని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్వెల్ సినిమాల నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ అంశాలకు లోటు లేకపోవడం.. విజువల్ ఎఫెక్ట్స్ వారెవా అనిపించడంతో సినిమా పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలు ఫ్యామిలీస్‌తో కలిసి పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూస్తున్నారు. ఈ వీకెండ్ మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ‘పుష్ప’ వల్ల రెండో రోజు స్క్రీన్ కౌంట్ తగ్గినప్పటికీ దాని పోటీని తట్టుకుని ‘స్పైడర్ మ్యాన్’ ఇండియాలో బ్లాక్‌బస్టర్ స్టేటస్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

This post was last modified on December 17, 2021 4:18 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బీఆర్ఎస్‌కూ కావాలొక వ్యూహ‌క‌ర్త‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌లు గ‌న్న…

1 hour ago

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

3 hours ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

3 hours ago

ముద్రగడ సమాధి కట్టేసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…

3 hours ago

ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…

4 hours ago

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

5 hours ago