ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల ప్రదర్శన చుట్టూ రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో ‘వకీల్ సాబ్’ రిలీజ్ టైంలో టికెట్ల రేట్లపై నియంత్రణ తెచ్చారు. అలాగే అదనపు షోలు, బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేసి పడేశారు. టికెట్ల రేట్లు మరీ ఎక్కువేమీ లేవని, రీజనబుల్‌గానే ఉన్నాయని.. అనూహ్యంగా పెరిగిపోతున్న నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలతో పోలిస్తే టికెట్ట రేట్లు బెటరే అని మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నా ప్రభుత్వం మాత్రం మొండి పట్టుదలతో టికెట్ల రేట్లపై నియంత్రణను కొనసాగిస్తోంది.
దీనికి తోడు షోల సంఖ్యను నియంత్రించడం, బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేయడంలో ఆంతర్యం ఏంటో జనాలకు అంతు బట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సినీ అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద హీరోల సినిమాలు రిలీజైనపుడు అభిమానుల కోసం తెల్లవారుజామునే బెనిఫిట్ షోలు వేయడం ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితీ. అభిమానులు ఈ షోలను ఎంతగా ఎంజాయ్ చేస్తారో చెప్పాల్సిన పని లేదు. ఐతే అవన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి. కనీసం ఉదయానే షోలు మొదలుపెట్టుకునే అవకాశం కూడా లేకపోయింది.
ఐతే ‘వకీల్ సాబ్’ తర్వాత రెండు వారాల ముందు వరకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయాల్సిన అవసరం పడ్డ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఈ నెల రెండో తారీఖున బాలకృష్ణ సినిమా ‘అఖండ’తోనే వాటి అవసరం ఏర్పడింది. ఐతే ఆ సినిమాకు అనధికారికంగా ఏపీలో పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు పడ్డాయి. తెల్లవారుజామున అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో స్పెషల్ షోలు వేశారు. అదనపు షోలు కూడా ప్లాన్ చేసుకున్నారు. వీటి విషయంలో అధికార వర్గాలు ఏం పట్టనట్లే ఉన్నాయి సాయంత్రం వరకు. షోలు నడుస్తున్నపుడు సైలెంటుగా ఉండి రాత్రికి థియేటర్ల మీద దాడులు జరిపారు. థియేటర్లపై కఠిన చర్యలు కూడా చేపట్టినట్లు కనిపించలేదు.
కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ విషయంలో మాత్రం చాలా పట్టుదలతో వ్యవహరించారు. దీనికి బెనిఫిట్ షోలు, అదనపు షోలు లేవు. మల్టీప్లెక్సుల్లో సైతం షోల మీద నియంత్రణ విధించారు. పొలిటికల్‌గా చూసుకుంటే జగన్‌కు బాలయ్యే ముఖ్యమైన ప్రత్యర్థి. ఆయన సినిమా విషయంలో కాస్త చూసీ చూడనట్లు వదిలేసి.. బన్నీ సినిమాపై ప్రతాపం చూపించడమేంటో అర్థం కావడం లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ మీద జగన్‌కున్న కోపమెలాంటిదో తెలిసిందే కానీ.. బన్నీ సినిమా విషయంలోనూ ఇంత పట్టుదలతో వ్యవహరిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఏదేమైనప్పటికీ బాలయ్యకు లేని రిస్ట్రిక్షన్స్ బన్నీకేంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
This post was last modified on December 17, 2021 4:58 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…