‘పుష్ప’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు సుకుమార్ రాని సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ప్రమోషన్లకు రాలేకపోయాడు. చివరికి విడుదల ముందు రోజు రాత్రి నిద్ర మొహంతో వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. అప్పుడాయన ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. తాను నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నానని.. సరిగా మాట్లాడలేకపోతున్నానని కూడా సుకుమార్ చెప్పాడు ఆ ప్రెస్ మీట్లో. కొన్ని రోజులుగా ఆయన ముంబయిలో కూర్చుని రేయింబవళ్లు కష్టపడుతున్నాడు.
ఎడిటింగ్, డిజిటల్ ఇంటర్మీడియట్, ఫైనల్ మిక్సింగ్ పనులను పర్యవేక్షిస్తున్నాడు. ఈ విషయంలో సుకుమార్ కమిట్మెంట్‌ను ఎంత పొగిడినా తక్కువే. కానీ సుకుమార్ ఇంత కష్టపడి ఏం లాభం అన్నట్లుంది సినిమా చూసినపుడు. సుక్కు కెరీర్లో ఇప్పటిదాకా టెక్నికల్‌గా ఇంత వీకెస్ట్ ఫిలిం ఇంకోటి లేదు అనే భావన కలిగింది సినిమా చూసిన ప్రేక్షకులకు. అలాగని ‘పుష్ప’ మీద తక్కువ ఖర్చు పెట్టారా అంటే అదీ కాదు.
సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారో.. మేకింగ్ విషయంలో సుకుమార్, సినిమాటోగ్రాఫర్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతున్నా సరే.. ‘పుష్ప’లో క్వాలిటీ మాత్రం కనిపించలేదు. విజువల్స్ అంత ఆకర్షణీయంగా లేవు. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సులు అని తేడా లేదు. అన్ని చోట్లా విజువల్స్ ఉండాల్సినంత ఆకర్షణీయంగా లేవు. స్క్రీన్ డల్లుగా కనిపించింది. సౌండ్ డిజైన్ కూడా ఏమీ బాగా లేదు. రీరికార్డింగ్ ఎఫెక్టివ్‌గా లేదు. కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా సరిగా జరిగినట్లు కనిపించలేదు. ఆన్ లొకేషన్లో క్యాజువల్‌గా డబ్ చేసిన సీన్లను అలాగే పెట్టేసినట్లు కనిపించింది. ఎడిటింగ్‌లో షార్ప్‌నెస్ లేదు. ఇదంతా చివరి నిమిషాల్లో హడావుడిగా చేసిన ఫలితం అనడంలో సందేహం లేదు.
రసూల్ పొకుట్టి లాంటి ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ పని చేసినా.. ఔట్ పుట్ ఇలా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా పేరున్న వాళ్లే. కానీ విడుదలకు పది రోజుల ముందు వరకు కూడా చిత్రీకరణ జరగడం.. ఔట్ పుట్ చాంతాడంత కావడంతో దాన్ని సరిగ్గా ఎడిట్ చేసి.. ఫైనల్ కట్ తీయడానికి చాలినంత సమయం లేకపోవడం.. ఈ కారణాల వల్ల ‘పుష్ప’ టెక్నికల్ గా అనేక లోపాలతో బయటికి వచ్చింది. ఇది సినిమా రిజల్ట్ మీద కూడా ప్రభావం చూపుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
This post was last modified on December 17, 2021 4:06 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…