అమీర్ ఖాన్ ‘లగాన్’ చిత్రాన్ని భారతీయ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఉత్తమ విదేశీ చిత్రం కేటరిగీలో నిలిచి ఆస్కార్ ఆశల్ని రేపిన సినిమా ఇది. ఆ తరవాత మరే సినిమా ఆ స్టేజీ వరకూ వెళ్లలేదు. ఇప్పుడు రాజమౌళి తన’RRR’లో ఆనాటి లగాన్ ని గుర్తు చేయబోతున్నాడు.
లగాన్‌లో అమీర్ ఖాన్ లవ్ ట్రాక్ గుర్తుంది కదా? ఓ బ్రిటీష్ దొరసాని కథానాయకుడ్ని చూసి మనసు పడుతుంది. బ్రిటీష్ దేశస్తురాలు అయ్యుండి.. క్రికెట్ ఆటలో భారతీయులు గెలవాలని కోరుకుంటుంది. తనకు తోచిన సహాయం చేస్తుంటుంది. ఆ ట్రాక్ ని బాగా డీల్ చేశాడు దర్శకుడు అశితోష్ గోవార్కర్. ఇప్పుడు అలాంటి లవ్ ట్రాకే ‘RRR’ లోనూ చూడబోతున్నామని టాక్.
ఈ చిత్రంలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తనకి జోడీగా హాలీవుడ్ నాయిన ఒలివియా మారిస్ నటిస్తోంది. తనో బ్రిటష్ దొరసాని. కొమరం భీమ్‌ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. బ్రిటీష్ దేశస్తురాలు అయ్యుండి, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న కొమరం భీమ్‌కి సహాయ పడుతుంది. ఆ తరవాత.. ఏం జరిగిందన్నదే మిగిలిన కథ.
దాదాపుగా ఈ ట్రాక్ లగాన్‌ని పోలి ఉంది. కాకపోతే.. రాజమౌళి మ్యాజిక్ వేరుగా ఉంటుంది. పాత కాన్సెప్టునే తీసుకొన్నా, కొత్తగా ముస్తాబు చేసి, మ్యాజిక్ చేయడం తనకు బాగా అలవాటు. మరి ఈసారి ఈ ప్రేమకథని ఏ రేంజులో తెరకెక్కిస్తాడో చూడాలి.
This post was last modified on June 9, 2020 12:33 am
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…