Movie News

US: ‘పుష్ప’.. టెన్షన్ టెన్షన్


ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ‘పుష్ప’ మూవీ. ఐతే ఇప్పటిదాకా ఫైనల్ కాపీ రెడీ కాలేదన్న సమాచారం బయ్యర్లు, ఎగ్జిబిటర్లను ఆందోళనలోకి నెడుతోంది. మామూలుగానే సుకుమార్ సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతుంటుంది. విడుదలకు కొన్ని రోజుల ముందు వరకు ఎడిటింగ్ జరుగుతుంటుంది. చివరి వరకు చిన్న చిన్న కరెక్షన్లు చేస్తూనే ఉంటాడు సుకుమార్. ‘పుష్ప’ విషయంలో మరింత ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం.

మొన్న జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా సుకుమార్ రాలేని పరిస్థితి తలెత్తింది. వేరే ప్రమోషన్లలో కూడా ఆయన కనిపించడం లేదు. ముంబయిలో కూర్చుని డీఐ పనులను పర్యవేక్షిస్తూ.. ఇంకోవైపు ఎడిటర్‌ను పక్కన పెట్టుకుని చిన్న చిన్న కరెక్షన్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో విడుదలకు మూడు రోజుల ముందు కూడా ఫైనల్ కాపీ రెడీ కాలేదు.మామూలుగా ఓవర్సీస్‌కు నాలుగైదు రోజుల ముందే ఫైనల్ కాపీ ఓకే చేసి కేడీఎంలు పంపేయాలి. కానీ ‘పుష్ప’ విషయంలో అలా జరగలేదు.

మిగతా ఏరియాల సంగతే చెప్పాల్సిన పనే లేదు. యుఎస్‌కు మంగళవారం కేడీఎంలు పంపినప్పటికీ.. అవి ఫైనల్ కాదని చెప్పారట. కొన్ని కరెక్షన్లు జరుగుతాయని, వాటిని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం ఇచ్చారట. కొన్ని సన్నివేశాలను తీసేయడం, వేరేవి యాడ్ చేయడం జరుగుతుండటంతో వివిధ భాషల పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆయా సిటీల్లో ఉండి పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లకు దిక్కు తోచని పరిస్థితి నెలకొందట.

ఇలా కరెక్షన్లు చేయడం వల్ల మళ్లీ డబ్బింగ్ ఆర్టిస్టులను పిలిపించి కొత్తగా కలిపిన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పించుకోవాల్సి వస్తోంది. కొత్తగా కలిపిన సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ చేయించి వాటిని ఫైనల్ మిక్స్ చేసి చివరగా ఫైనల్ కాపీ తీయనున్నారు. ఈ పని విడుదలకు ముందు రోజు కానీ పూర్తి కాదని.. దీని వల్ల యుఎస్ ప్రిమియర్స్ విషయంలో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ బాగా టెన్షన్ పడుతున్నారని.. వివిధ భాషల్లోనూ బయ్యర్లు సమయానికి సినిమా రిలీజవుతుందా లేదా అనే ఆందోళనతోనే ఉన్నారని తెలిసింది.

This post was last modified on December 15, 2021 3:49 pm

Share

Recent Posts

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

1 hour ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

2 hours ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

4 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

5 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

6 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

7 hours ago