బ్రహ్మాస్త్ర.. బాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్స్‌లో ఇదొకటి. రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి పాపులర్ స్టార్స్ చాలామంది నటిస్తుండటంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే నాలుగేళ్ల నుంచి సినిమాని చెక్కుతూనే ఉన్నాడు అయాన్ ముఖర్జీ.
షూటింగ్ పూర్తయ్యిందని ఈమధ్యే తెలియడంతో త్వరలోనే రిలీజ్ ఉంటుందని ఆశించారంతా. కానీ ఆ ఆశ అంత త్వరగా తీరేలా కనిపించడం లేదు. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని వచ్చే యేడు సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు నిర్మాత కరణ్ జోహార్. అంటే దాదాపు ఇంకో సంవత్సరం పాటు ఈ మూవీ కోసం వెయిట్ చేయాలన్నమాట.
ఇదొక సూపర్ హీరో ఫిల్మ్. త్రీడీ, ఐమాక్య్ ఫార్మాట్స్‌లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
అదీ మూడు భాగాలుగా. మొదటి భాగమే ఐదేళ్లకు రిలీజైతే మిగిలినవి ఎప్పటికి వస్తాయనేది ఊహకు కూడా అందని విషయం. అయితే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ చూస్తే మాత్రం సినిమాపై ఆసక్తి పెరగడం ఖాయం. శివ అనే పాత్రలో రణ్‌బీర్ నటించాడు.
మండే మంటల మధ్య చొక్కా కూడా లేకుండా నిలబడి ఆవేశంగా కనిపిస్తున్నాడు. ఈ ప్రపంచంలోని దుష్టశక్తులన్నింటితోటీ పోరాడటానికి సిద్ధంగా ఉన్న వీరుడిలా ఉన్నాడు. మరికొన్ని గంటల్లో మోషన్ పోస్టర్ కూడా వదలబోతున్నారు. అది మరింత సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని ఊరిస్తున్నారు. ఇన్నేళ్ల వెయిటింగ్‌కి ఆ మాత్రం ఫలితం ఉండాలిగా మరి.
This post was last modified on December 15, 2021 1:39 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…