వరల్డ్ వైడ్ చూసుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో నెట్ ఫ్లిక్స్‌దే ఆధిపత్యం. కొంత కాలం నెట్ ఫ్లిక్స్‌తో కలిసి పని చేసిన దర్శకుడు దేవా కట్టా చెప్పిన దాని ప్రకారం కంటెంట్ క్రియేషన్ మీద రోజుకు నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేస్తుందట. ఐతే ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల నెట్ ఫ్లిక్స్‌దే ఆధిపత్యం అయినా.. ఇండియాలో మాత్రం దాని మీద అమేజాన్ ప్రైమ్‌దే పైచేయి. చాలా ముందే ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టి.. పెద్ద ఎత్తున లోకల్ కంటెంట్ అందిస్తూ, తక్కువ సబ్‌స్క్రిప్షన్ ధర, ఆఫర్లతో మన ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించి ఆదరణ పెంచుకుంది.
నెట్ ఫ్లిక్స్ చాలా లేటుగా ఇండియన్ మార్కెట్ మీద దృష్టిపెట్టింది. కంటెంట్ కూడా అమేజాన్ ప్రైమ్ స్థాయిలో ఇవ్వలేకపోయింది. అమేజాన్ ప్రైమ్ రీజనబుల్ ప్రైస్‌లో ఒక సబ్‌స్క్రిప్షన్ మీద ఎక్కువమందికి యాక్సెస్ ఇస్తుండగా.. నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలు ఎక్కువ, పైగా ఒక సబ్‌స్క్రిప్షన్ మీద ఒకరికే యాక్సెస్ ఉండటం కూడా ప్రతికూలతే. ఐతే ఇండియన్ మార్కెట్‌ను కొంచెం లేటుగా అర్థం చేసుకుని కంటెంట్ క్రియేషన్ పెంచుతున్న నెట్ ఫ్లిక్స్.. అమేజాన్ ప్రైమ్‌కు ఇప్పుడో పెద్ద ఝలక్ ఇచ్చింది.
ప్రైమ్ వార్షిక ప్లాన్ రూ.999 నుంచి 1499కి పెంచిన టైంలో నెట్ ఫ్లిక్స్ తన సబ్‌స్క్రిప్షన్ ధరలను బాగా తగ్గించడం విశేషం. ఇప్పటికే మరో టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంచగా.. ఇప్పుడు ప్రైమ్ కూడా అదే బాట పట్టింది. ఇదే సమయంలో నెట్ ఫ్లిక్స్ ధరలు తగ్గించాలన్న నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యమే. ఇప్పటిదాకా నెలవారీ నెట్ ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.199 ఉండగా దాన్ని రూ.149కి తగ్గించారు. మరోవైపు మొబైల్‌తో పాటు టీవీ, ట్యాబ్, పీసీ.. ఇలా అన్నింటికీ కలిపి యాక్సెస్ ఉన్న సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు 499 ఉండగా.. దాన్ని అమాంతం 199కి తగ్గించేసింది నెట్ ఫ్లిక్స్.
అమేజాన్ ప్రైమ్ ధరలు పెరుగుతున్న టైంలో ఇలా రేట్లు తగ్గించడం అంటే మాస్టర్ స్ట్రోక్ అన్నట్లే. ఇంటర్నేషనల్ కంటెంట్ విషయంలో నెట్ ఫ్లిక్స్‌ను కొట్టే వాళ్లెవ్వరూ లేరు. కాకపోతే సబ్‌స్క్రిప్షన్ రేటు బాగా ఎక్కువ కావడం, యాక్సెస్ తక్కువగా ఉండటంతో ఇండియాలో సబ్‌స్క్రిప్షన్లు ఎక్కువ సంఖ్యలో లేవు. కానీ ఇప్పుడిలా ధరలు తగ్గించడం, అదే సమయంలో ఇండియన్ కంటెంట్ కూడా పెంచుతుండటంతో మున్ముందు నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్లు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
This post was last modified on December 15, 2021 1:28 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…