Movie News

Chiru 156.. ఎవ‌రీ మాధ‌వి రాజు?

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మామూలు ఊపు లేరు. వ‌రుస‌గా సినిమాలు చేసుకుపోతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాలు ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. ఆచార్య త్వ‌రలోనే విడుద‌ల కానుండ‌గా.. ఇంకో మూడు సినిమాల‌ను ప్ర‌క‌టించి, సమాంత‌రంగా ఆ మూడు చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు మెగాస్టార్. ఇవి చాల‌వ‌న్న‌ట్లు ఇప్పుడు చిరు కొత్త‌గా మ‌రో సినిమాను ప్ర‌క‌టించారు. త‌న‌కు వీరాభిమాని అయిన యువ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌తో చిరు ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి వెల్ల‌డైన సంగతి తెలిసిందే.

ఛ‌లో, భీష్మ చిత్రాల‌తో సూప‌ర్ హిట్లు కొట్టిన వెంకీతో చిరు సినిమా చేయ‌బోతుండ‌టం అభిమానుల‌ను బాగానే ఎగ్జైట్ చేస్తోంది. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దాన‌య్య నిర్మించ‌బోతున్నారు. ఐతే ఆయ‌న‌కు తోడుగా డాక్ట‌ర్ మాధ‌వి రాజు అనే నిర్మాత కూడా ఈ ప్రాజెక్టులో భాగ‌స్వామి కావ‌డం గ‌మ‌నార్హం.

ఐతే ఈ పేరు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేనిది, ఎప్పుడూ విన‌నిది. ఇంత‌కీ ఎవ‌రీ మాధ‌వీ రాజు అని అంతా సోష‌ల్ మీడియాలో వెత‌క‌డం మొద‌లైంది. ఈమె ఎవ‌రో కాదు.. చిరంజీవికి స్వ‌యంగా సోద‌రి. చిరుకు ఇద్ద‌రు సోద‌రీమ‌ణులున్న సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌రు విజ‌య‌దుర్గ‌. ఆమె సాయిధ‌ర‌మ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్‌ల త‌ల్లి. ఈమె సినిమా ఈవెంట్ల‌లో, అక్క‌డా ఇక్క‌డా కాస్త క‌నిపిస్తుంటారు కాబ‌ట్టి జ‌నాల‌కు ఓ మోస్త‌రుగా తెలుసు.

కానీ ఇంకో సోద‌రి మాధ‌వీ రావు మీడియాలో క‌నిపించ‌డం చాలా త‌క్కువ‌. ఆమె వైద్యురాలు. చిరంజీవి నిర్వ‌హించిన వైద్య శిబిరాల్లో, కుటుంబ వేడుక‌ల్లో కొన్నిసార్లు క‌నిపించారు. మ‌రో సోద‌రి కొడుకులిద్ద‌రినీ సినిమాల్లోకి తీసుకొచ్చి వాళ్లు నిల‌దొక్కుకునేలా చేయ‌డంలో చిరు కీల‌క పాత్ర పోషించారు. ఇప్పుడు ఇంకో సోద‌రిని నిర్మాత‌గా ప‌రిచ‌యం చేసి ఆమెకు త‌న వంతు చేయాల్సిన సాయం చేస్తున్నార‌న్న‌మాట‌.

This post was last modified on December 15, 2021 10:48 am

Share

Recent Posts

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

24 minutes ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

52 minutes ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

5 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

12 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

12 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

13 hours ago