ఇప్పుడు దేశంలో ప్రతి హీరో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకునే దర్శకుల్లో రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. బాహుబలితో ఆయన క్రేజ్ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. ఆ సినిమాతో ప్రపంచ స్థాయిలో ఆయన పేరు మార్మోగింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం జక్కన్నతో ఓ సినిమా చేయాలని ఆశ పడుతుంటారంటే అతిశయోక్తి కాదు.
ఇక మన స్టార్ల గురించి చెప్పేదేముంది? సీనియర్లను పక్కన పెడితే తెలుగులో కొంతమంది పెద్ద స్టార్లతో జక్కన్న సినిమాలు చేశాడు కానీ.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లతో ఇప్పటిదాకా జట్టు కట్టలేదు. మహేష్ బాబుతో త్వరలోనే ఆయన సినిమా మొదలు కాబోతోంది. పవన్ కళ్యాణ్‌తో అయితే రాజమౌళి సినిమా చేసే అవకాశాలు అంతగా కనిపించడం లేదు.
అయితే అల్లు అర్జున్‌తో మాత్రం ఎప్పుడో ఒకప్పుడు రాజమౌళి సినిమా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల పుష్ప ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ గురించి రాజమౌళి గొప్పగా మాట్లాడటంతో వీరి కలయికలో సినిమా మీద అభిమానులకు ఆశలు కలిగాయి. ఇంతకీ రాజమౌళి మాటలు విని మీకేమనిపించింది.. ఆయనతో సినిమా సంగతేంటి అని మీడియా వాళ్లు బన్నీని అడిగితే.. ఆయన మాటలు చాలా ఆనందం కలిగించాయి. నా మనసును తాకాయి. ఆయనతో సినిమా చేయాలని ఏ హీరోకి ఉండదు? నాక్కూడా ఉంది.
మీతో సినిమా చేయాలనుందని ఆయన్ని నేనూ అడిగా. తప్పకుండా చేద్దామని, తాను సినిమా చేయాలనుకునే హీరోల్లో నేనూ ఒకడినని చెప్పారు. కచ్చితంగా ఏదో ఒక రోజు ఇద్దరం కలిసి సినిమా చేస్తామని నమ్ముతున్నా అని బన్నీ చెప్పాడు. ప్రస్తుత కమిట్మెంట్ల ప్రకారం చూస్తే వచ్చే రెండు మూడేళ్లలో రాజమౌళి, బన్నీ కలిసి సినిమా చేయకపోవచ్చు. తన కలల ప్రాజెక్టు అయిన మహాభారతం తీసేలోపు బన్నీతో జక్కన్న ఓ సినిమా చేస్తాడేమో చూద్దాం మరి.
This post was last modified on December 15, 2021 9:39 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…