ఒక్కటీ రెండూ కాదు.. ఒకేసారి నాలుగు సినిమాలకు వర్క్ చేస్తున్నారు చిరంజీవి. ఆచార్య, గాడ్‌ఫాదర్, భోళాశంకర్ చిత్రాలతో పాటు బాబి సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు వాటి సరసన మరో సినిమా చేరింది. మెగాస్టార్ 156వ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ఛలో, భీష్మ చిత్రాలు తీసి హిట్టు కొట్టిన వెంకీ కుడుముల డైరెక్షన్‌లో చిరంజీవి నటించనున్నారనే వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పుడది నిజమేనని కన్‌ఫర్మ్ అయ్యింది. వెంకీ, చిరుల కాంబినేషన్‌లో సినిమా రానున్నట్లు అనౌన్స్‌మెంట్ వచ్చింది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాక్టర్ మాధవీ రాజు సహ నిర్మాత.
‘కొన్ని అవకాశాలు చాలా అరుదుగా దొరకుతాయి. నన్ను నమ్మి ఈ చాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చిరంజీవి గారూ. మీపై నాకున్న ఆరాధన, నామీద మీకున్న నమ్మకమే నేను ఈ సినిమా విషయంలో బెస్ట్ ఇచ్చేందుకు ప్రోత్సహిస్తాయి’ అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా చిరంజీవికి థ్యాంక్స్ చెప్పాడు వెంకీ. మెగాస్టార్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉందంటూ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ కూడా ప్రకటించింది. త్వరలోనే సినిమా సెట్స్‌కి వెళ్లబోతోంది.
వెంకీ కుడుముల చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని చిరంజీవి కూడా చెప్పారు. అలాంటి తనకి మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చింది. అది కూడా చాలా త్వరగా. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వెంకీ కెరీర్ ఎవరూ ఊహించని మలుపు తిరగడం ఖాయం. కాకపోతే ఇప్పటి వరకు యంగ్ హీరోలతో ఛలో, భీష్మ లాంటి యూత్‌ఫుల్ చిత్రాలే తీశాడు వెంకీ. మరి తన ఫేవరేట్ హీరో కోసం ఎలాంటి కథ అల్లాడో.. ఆయన్ని ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకొస్తాడో.
This post was last modified on December 14, 2021 7:04 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…