ఒక సినిమాకు పని చేస్తున్న యూనిట్లో అందరికీ ఆ సినిమా కథేంటో తెలియాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్ కాస్ట్ అండ్ క్రూకు కథ మీద అవగాహన ఉండాల్సిందే. ముఖ్యంగా హీరో హీరోయిన్లకు పూర్తి కథ.. అలాగే తమ పాత్రలపై పూర్తి అవగాహన ఉంటే సినిమాలో మరింతగా ఇన్వాల్వ్ కావడానికి, ఇంకా బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశముంటుంది. ఐతే ‘పుష్ప’ సినిమాలో కథానాయికగా నటించిన రష్మిక మందన్నకు ఈ చిత్ర కథేంటో తెలియదట.
ఈ విషయాన్ని ‘పుష్ప’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసినపుడు స్వయంగా ఆమే వెల్లడించింది. ‘పుష్ప’ కథ విన్నపుడు మీకేమనిపించింది అని రష్మికను అడిగితే.. ‘‘సుకుమార్ సర్ నాకెప్పుడూ పూర్తి కథ చెప్పలేదు. నాకే కాదు.. యూనిట్లో చాలామందికి ఆయన కథ చెప్పలేదు. కానీ సుకుమార్ సార్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఆయన్ని నమ్మి ముందుకెళ్లిపోయా.
డబ్బింగ్ టైంలో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చూశా. ఇలాంటి సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉంది’’ అని రష్మిక చెప్పింది. ఇక ‘పుష్ప’ పార్ట్-1లో తన పాత్ర టీజర్ లాగా ఉంటుందని.. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం, నిడివి ఉంటాయని రష్మిక వెల్లడించింది. తనకు ‘పుష్ప’ కథేంటో తెలియదన్న రష్మిక మాటలకు మరీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
బేసిగ్గా సుకుమార్.. హీరో, కెమెరామన్‌కు మినహాయిస్తే కథ చెప్పరని.. స్టోరీ లీక్ అయిపోతుందన్న భయం దీనికో కారణం అయితే.. ఆయన స్క్రిప్టును ఎప్పుడూ లాక్ చేయరని, మేకింగ్ టైంలో కూడా మార్పులు చేర్పులు జరగడం వల్ల కథ ఇది అని ఎవరికీ చెప్పరని.. ఆయనతో పని చేసే రైటర్లకు కూడా కథ మీద క్లారిటీ ఉండదని సన్నిహితులు అంటుంటారు. ‘పుష్ప’ విషయంలోనూ ఆయన అదే ఒరవడిని కొనసాగించినట్లున్నారు.
This post was last modified on December 14, 2021 3:08 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…