నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ మూవీ అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు దక్కించుకుంది. టాక్ ఏమంత గొప్పగా లేకపోయినా.. ఈ సినిమా తొలి వీకెండ్లో అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్స్‌తో రన్ అయింది. తెలుగు రాష్ట్రాల అవతల, ముఖ్యంగా యుఎస్‌లో ఈ సినిమాకు జరిగిన బుకింగ్స్, వచ్చిన వసూళ్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంకా బాక్సాఫీస్ పూర్తి స్థాయిలో పుంజుకోని రోజుల్లో విడుదలై ఈ స్థాయిలో థియేటర్లలో సందడి వాతావరణం తీసుకురావడంతో సినీ పరిశ్రమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్, రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. అఖండకు వరల్డ్ వైడ్ జరిగిన థియేట్రికల్ బిజినెస్ రూ.56 కోట్లు. అంటే ఇప్పటికే బయ్యర్లందరూ లాభాల బాటలో ఉన్నారని భావించవచ్చు.
కానీ మిగతా అన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. బయ్యర్లకు లాభాలు అందించింది కానీ.. ఒక్క ఆంధ్రా ఏరియాలో మాత్రం ఇంకా ఈ చిత్రం పెట్టుబడి వెనక్కి తేలేదు. నైజాంలో అఖండ హక్కుల్ని రూ.10.5 కోట్లకు కొన్న దిల్ రాజు.. ఆరేడు కోట్ల మధ్య లాభాల్లో ఉండగా, సీడెడ్లో ఈ చిత్రానికి రూ.15 కోట్ల మేర బిజినెస్ జరిగితే ఇప్పటికే రూ.12 కోట్ల దాకా షేర్ వచ్చింది, లాభాలు దక్కాయి.
కానీ ఆంధ్రాలోని మిగతా అన్ని జిల్లాలకు కలిపి ఈ చిత్రాన్ని రూ.26 కోట్లకు అమ్మితే ఇప్పటిదాకా వసూలైన షేర్ రూ.21.5 కోట్లే. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ ఉండటం వల్లే ఇంకా ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోలేకపోయింది. ఇటు ఆంధ్రాలో, రాయలసీమలో సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతోనే నడిచినప్పటికీ.. ఏపీలో బ్రేక్ ఈవెన్‌కు ఇంకా చాలా దూరంలోనే ఉందీ చిత్రం. ఈ వారం పుష్పతో పాటు స్పైడర్ మ్యాన్ కూడా రిలీజవుతున్న నేపథ్యంలో ఆంధ్రాలో అఖండ స్వల్ప నష్టాలను మిగిల్చేలా ఉంది.
This post was last modified on December 14, 2021 8:32 am
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…