Movie News

అరుదైన ఘ‌న‌త‌కు చేరువ‌లో అఖండ‌

యుఎస్‌లో తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచి గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అక్క‌డ క్లాస్ సినిమాల‌కే ప‌ట్టం క‌డుతుంటారు. మాస్ సినిమాలు వాళ్ల‌కు అంత‌గా రుచించ‌వు. మిగ‌తా హీరోల సంగ‌తి ప‌క్క‌న పెడితే ఎక్కువ‌గా మాస్ మ‌సాలా సినిమాలు చేసే నంద‌మూరి బాల‌కృష్ణకు యుఎస్‌లో స‌రైన మార్కెట్ లేదు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిని మిన‌హాయిస్తే ఏ బాల‌య్య‌ చిత్ర‌మూ అక్క‌డ భారీ వ‌సూళ్లు సాధించింది లేదు. అది మిన‌హా బాల‌య్య‌కు మిలియ‌న్ డాల‌ర్ల సినిమానే లేదు యుఎస్‌లో.

శాత‌క‌ర్ణి త‌ర్వాత బాల‌య్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన లెజెండ్ యుఎస్‌లో హాఫ్ మిలియ‌న్ మార్కును కూడా అందుకోలేదు. ఇప్పుడు బాల‌య్య కొత్త చిత్రం అఖండ కూడా ఊర మాస్ సినిమా కావ‌డం, పైగా క‌రోనా త‌ర్వాత యుఎస్‌లో తెలుగు సినిమాల మార్కెట్ బాగా దెబ్బ తిన‌డంతో ఈ మూవీ మ‌హా అయితే హాఫ్ మిలియ‌న్ మార్కును ట‌చ్ చేస్తే ఎక్కువ అనుకున్నారు.

కానీ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ అఖండ యుఎస్‌లో ఇర‌గాడేసింది. ప్రిమియ‌ర్ల‌తోనే 3 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు పైగా కొల్ల‌గొట్టి ఔరా అనిపించింది. తొలి వారాంతం అయ్యేస‌రికి వ‌సూళ్లు 8 ల‌క్ష‌ల డాల‌ర్ల మార్కును దాటేశాయి. ఆ త‌ర్వాత సినిమా జోరు త‌గ్గింది. అలాగని దాని ర‌న్ మాత్రం ఆగిపోలేదు. రెండో వీకెండ్లో కూడా ఓ మోస్త‌రు వ‌సూళ్లు సాధించి మిలియ‌న్ డాల‌ర్ మార్కుకు అత్యంత చేరువ‌గా వ‌చ్చింది.

రెండో వీకెండ్ అయ్యేస‌రికి అఖండ యుఎస్ వ‌సూళ్లు 9.94 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు చేరుకున్నాయి. ఇంకో 6 వేల డాల‌ర్లు వ‌స్తే ఈ చిత్రం మిలియ‌న్ డాల‌ర్ మార్కును అందుకుంటుంది. అదేమంత క‌ష్టం కాక‌పోవ‌చ్చు. ఇలాంటి ఊర మాస్ మూవీతో, ఈ టైంలో మిలియ‌న్ డాల‌ర్ల మార్కును అందుకోవ‌డం బాల‌య్య‌కు గొప్ప ఘ‌న‌తే. రాబోయే పెద్ద సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్‌లోనూ మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చింది అఖండ‌.

This post was last modified on December 13, 2021 8:26 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

20 minutes ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

1 hour ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

2 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

2 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

2 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

3 hours ago