విలక్షణ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణలో గొప్ప ప్రతిభ ఉన్నా ఆయన ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేశాడు. ఆయనతో పని చేసిన పెద్ద హీరో అంటే నాని మాత్రమే. అతను కూడా మోహనకృష్ణతో కలిసి జీరో నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. దీంతో ఆ తర్వాత కూడా ఆయనతో రెండు సినిమాల్లో నటించాడు.
ఇంద్రగంటికి పెద్ద స్టార్లతో పని చేయాలని ఉంది, వాళ్లను డీల్ చేయగల సత్తా ఉంది కానీ.. ఆయనకు అవకాశం రాలేదు. ఇప్పుడు ఇంద్రగంటి నుంచి రానున్న ‘వి’ను ఆయన పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో చేయాలనుకున్నట్లుగా ఓ‘ ప్రచారం నడిచింది. ఈ విషయాన్ని ఇందులో కీలక పాత్ర చేసిన సుధీర్ బాబు కూడా ధ్రువీకరించాడు. ఇది పవన్, మహేష్‌ల కోసం అనుకున్న కథ అని ఇంద్రగంటి తనతో అన్నారని.. ఆ తర్వాత ఇందులో ఓ పాత్రను తనకే ఇచ్చాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సుధీర్.
ఐతే ఇదే విషయాన్ని ఇప్పుడు ఇంద్రగంటి వద్ద ప్రస్తావిస్తే.. నవ్వేశారు. ఈ కథను పవన్, మహేష్ చేస్తే బాగుంటుందని సరదాగా సుధీర్ దగ్గరన అన్నానని.. అంతే తప్ప వాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ కథ తయారు చేయలేదని ఇంద్రగంటి స్పష్టం చేశాడు.
నాని ఎప్పుడూ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు కాబట్టే అతడికి వరుసగా రెండోసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఇచ్చానని.. సినిమాలో రెండు ముఖ్య పాత్రల గురించి చెప్పి.. నెగెటివ్ రోల్ చేయమని అడిగితే తాను కూడా అదే కోరుకుంటున్నట్లు చెప్పి నాని మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అయ్యాడని ఇంద్రగంటి చెప్పాడు.
తన కొత్త సినిమాల గురించి ఇంద్రగంటి మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో పాటు నాగచైతన్య కోసం కూడా కథలు సిద్ధం చేశానని.. వీరిలో ఎవరితో ముందు సినిమా చేస్తానో చెప్పలేనని అన్నాడు. ఐతే విశ్వసనీయ సమాచారం ప్రకారం దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా ఇంద్రగంటి తన తర్వాతి సినిమా చేసే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates