క్రాక్ సక్సెస్ ఇచ్చిన కిక్‌లో వరుస సినిమాలకు కమిటయ్యాడు రవితేజ. వాటిలో అన్నింటికంటే ముందు సెట్స్‌కి వెళ్లిన సినిమా ఖిలాడి. రమేష్ వర్మ డైరెక్షన్‌లో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్. రవితేజ లుక్‌తో పాటు టీజర్ కూడా మూవీపై ఆసక్తిని పెంచేసింది. అయితే సినిమా చూడ్డానికి మాత్రం ప్రేక్షకులు చాలాకాలమే వెయిట్ చేయాల్సి వచ్చింది.
రవితేజ డ్యూయెల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాలేదు. ఈలోపు రవితేజ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ని ప్రకటించాడు. సెట్స్‌కి తీసుకెళ్లాడు. ఈ చిత్రాన్ని మార్చ్ 25న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఖిలాడి వర్క్ మాత్రం ముందుకు కదలడం లేదని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఫారిన్‌లో తీయాల్సిన సీన్స్ కావడం వల్లే ఇబ్బంది వస్తోంది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో షూటింగులకి పర్మిషన్స్ లేవు. పైగా థర్డ్ వేవ్ కూడా వస్తున్నట్లు చెబుతున్నారు. దాంతో ఖిలాడి భవిష్యత్తు కన్‌ఫ్యూజన్‌లో పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పైగా రవితేజ రామారావ్ ఆన్ డ్యూటీతో పాటు ధమాకా చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. బ్యాక్ టు బ్యాక్ షూటింగులతో బిజీబిజీగా ఉన్నాడు. వీటి తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఈ టైమ్‌లో బ్రేక్ తీసుకుని ఖిలాడి కోసం ఫారిన్ వెళ్లడం అయ్యే పనేనా? ఇవన్నీ చూస్తుంటే ఖిలాడి అనుకున్న టైమ్‌కి రావడం జరుగుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఖిలాడి కంటే రామారావే ముందు వచ్చేస్తాడనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో టీమ్ ఏమంటుందో చూడాలి మరి!
This post was last modified on December 11, 2021 10:41 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…