నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ’ బాక్సాఫీస్ ప్రభంజనం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. టాక్ అంత గొప్పగా లేకపోయినా ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్ల మోత మోగిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాలయ్య కెరీర్లోనే ఈ చిత్రం హైయెస్ట్ గ్రాసర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే 50 కోట్ల షేర్ మార్కును ‘అఖండ’ దాటేసింది. ఫుల్ రన్లో రూ.60 కోట్ల షేర్ మార్కును కూడా టచ్ చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా గ్రాస్ రూ.100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం.
ఈ వారం రిలీజైన కొత్త చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డల్ నోట్‌తో మొదలయ్యాయి. దీంతో ఈ వీకెండ్లో కూడా ‘అఖండ’ జోరే సాగేలా కనిపిస్తోంది కాబట్టి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని దాటి ‘అఖండ’ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం లాంఛనమే కావచ్చు. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ ఉన్నా, అదనపు షోలకు అవకాశం లేకపోయినా ఈ స్థాయిలో సినిమా వసూళ్లు రాబట్టడం విశేషమే.
‘అఖండ’కు వస్తున్న వసూళ్లు చూసి.. బాలయ్య చివరి సినిమా ‘రూలర్’ కలెక్షన్లతో పోల్చి అందరూ షాకవుతున్నారిప్పుడు. ఆ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చినప్పటికీ.. ఓపెనింగ్స్ మరీ దారుణం. మొత్తంగా రూ.10 కోట్ల షేర్ మార్కును కూడా టచ్ చేయలేదు. ఏడెనిమిది కోట్ల మధ్య షేర్‌కు పరిమితం అయింది. అంతకుముందు బాలయ్య నుంచి వచ్చిన ‘యన్.టి.ఆర్: మహా నాయకుడు’ అయితే మరీ 5 కోట్ల షేర్ మార్కు దగ్గర ఆగిపోయింది.
‘యన్.టి.ఆర్’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎదురైన పరాభవానికి తోడు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూడటంతో ‘రూలర్’ టైంకి బాలయ్య అభిమానులు మరీ చల్లబడిపోయారు. కనీసం ఫ్యాన్స్ కూడా ఆ సినిమా చూడ్డానికి ముందుకు రాలేదు. ‘అఖండ’ సినిమా మొదలైనపుడు కూడా వారిలో చలనం లేదు. కానీ ఈ సినిమా రిలీజ్ టైంకి మొత్తం కథ మారిపోయింది. ఊహించని రీతిలో దీనికి హైప్ వచ్చింది. ఇక రిలీజ్ తర్వాత సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా నిద్రాణంలో ఉన్న బాలయ్య అభిమానుల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది.
సినిమాల పరంగానే బాలయ్య పతనానికి తోడు.. రాజకీయంగా టీడీపీ వైఫల్యం వల్ల చల్లబడిపోయి ఉన్న ఫ్యాన్స్.. రాజకీయంగా టీడీపీ పుంజుకుని, కొంచెం ఆశావహ పరిస్థితులు కనిపిస్తుండటం.. అదే సమయంలో బోయపాటితో బాలయ్య చేసిన సినిమా రిలీజై తాము కోరుకున్న తరహాలో హీరో కనిపించడంతో వారిలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. దీంతో ‘అఖండ’ను మళ్లీ మళ్లీ ఎగబడి చూస్తున్నారు. పొలిటికల్‌గా కూడా టీడీపీ మద్దతుదారులు రీయూనియన్ అయి ఈ సినిమాను తమ భుజాల మీద మోస్తున్నారు. ఇక చాలా కాలంగా సరైన మాస్ సినిమా లేక నైరాశ్యంలో ఉన్న ఆ వర్గం ప్రేక్షకులకు కూడా ‘అఖండ’ రూపంలో సరైన సినిమా తగలడంతో ఈ చిత్రం అసాధారణంగా ఆడేస్తోంది.
This post was last modified on December 11, 2021 6:49 pm
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…