టాలీవుడ్ స్టార్ హీరోస్లో ఒకడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో ఎంతమంది గ్రేట్ ఆర్టిస్టులైనా ఉండొచ్చు. కానీ మెయిల్ లీడ్స్‌లో ఒకడు తను. అయినా కూడా ఆ ఫీలింగ్ ఎన్టీఆర్‌లో ఎక్కడా కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్లోని వినయం చూసి అక్కడివారు అంటున్న మాటలివి.
ఈరోజు ఉదయం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొనడానికి దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్యలతో కలిసి ముంబై వెళ్లాడు తారక్. హీరోయిన్ ఆలియాభట్, కీలక పాత్రలో నటించిన అజయ్ దేవగన్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అక్కడ ఎంతో హుషారుగా మాట్లాడి నార్త్ ప్రేక్షకుల్ని, మీడియాని మెస్మరైజ్ చేశాడు ఎన్టీఆర్. దేశంలోని ఇంత పెద్ద స్టార్స్‌తో నటించడం ఒక కల అనడంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
అజయ్ దేవగన్‌తో నటించడం గురించి అడిగితే కూడా ఎంతో పొలైట్‌గా, హంబుల్‌గా మాట్లాడి మెప్పించాడు తారక్. ఆయనతో తనని పోల్చవద్దని, ఆయన గొప్ప స్టార్ అని, అజయ్ ముందు తామంతా పిల్లలమేనని అన్నాడు. సెన్సేషన్ సృష్టించిన ‘పూల్ ఔర్ కాంటే’లోని అజయ్ ఎంట్రీని కూడా గుర్తు చేసి పొగిడేశాడు. ఆయనతో పని చేయడమంటే ఒక గురువుతో వర్క్ చేసినట్టేనని, అజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని చెప్పాడు.
నిజానికి మూవీలో అజయ్, ఆలియాలు పోషించిన పాత్రలు చిన్నవే. కానీ తాను ఉన్నది వారి గడ్డ మీద. అక్కడ ఉన్నవారంతా వాళ్ల అభిమానులు. ఆ యాక్టర్స్‌ని గౌరవించడం, వారి అభిమానుల్ని సంతోషపెట్టడం తన బాధ్యతగా ఎన్టీఆర్ గుర్తించడం, అంత వినమ్రతతో మాట్లాడటం చాలా గొప్పగా అనిపించింది. ఎదిగినా ఒదిగి ఉండే ఈ గుణమే ఎన్టీఆర్‌లో అందరికీ నచ్చే విషయమని, అలా ఉండటం తనకే చెల్లిందని అందరూ కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates