ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ అనదగ్గ ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌తో ప్రేక్షకులను పలకరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన థియేటర్లలో ఉదయం పది గంటలకు ఈ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఒక సినిమాకు వచ్చినట్లుగా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడమే కాదు.. థియేటర్ల ముందు మామూలుగా సందడి చేయలేదు. బైక్ ర్యాలీలు.. మేళాలు తాళాలు.. బాణసంచా మోతలు.. అబ్బో చాలా హంగామానే నడిచింది.
ఇక ట్రైలర్ ప్రదర్శితమైనపుడు థియేటర్లలో సందడి మరో స్థాయికి చేరింది. అంచనాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ట్రైలర్ ఉండటం.. మూడు నిమిషాల్లో లెక్కలేనన్ని గూస్ బంప్స్ మూమెంట్స్ ఉండటంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. తారక్, చరణ్ విడివిడిగా.. అలాగే కలిసి ఉర్రూతూలించేశారు ఫ్యాన్స్‌ను. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.ఐతే ట్రైలర్లో మిగతా అంశాలన్నీ ఒకెత్తయితే.. తారక్, చరణ్‌లకు విడివిడిగా పెట్టిన ఎలివేషన్ షాట్స్ మరో ఎత్తు.
ట్రైలర్ ఆరంభంలోనే ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించే షాట్ ఒకటి పెట్టాడు రాజమౌళి. పులితో ఫైట్‌కు సంబంధించి చిన్న గ్లింప్స్ చూపించి.. తారక్‌ను కట్టేసి ఉండగా పులి దగ్గరగా వచ్చి గాండ్రించడం.. తారక్ ఏమాత్రం భయపడకుండా బదులుగా తనూ అదే స్థాయిలో గర్జించడం చూసి ప్రేక్షకులు విస్తుబోయారు. ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ ఈ షాట్‌నే షేర్ చేస్తున్నారు. మామూలుగానే తారక్‌ను అభిమానులు యంగ్ టైగర్ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే పులితో ఫైట్ పెట్టడం.. ఇలా పులికి దీటుగా తారక్ గాండ్రించే షాట్ పెట్టడంతో ఎలివేషన్లలో జక్కన్నను మించినోడు లేడని కొనియాడుతున్నారు. ఇక చరణ్ విషయానికి వస్తే.. మెగా అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకునే షాట్ ట్రైలర్ చివర్లో చూపించారు.
ఇప్పటిదాకా ప్రోమోల్లో చరణ్‌ను పోలీసుగా, మామూలు కుర్రాడిగానే చూపించారు. సీతారామరాజు అవతారంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు తప్ప.. వీడియోల్లో ఎక్కడా ఒక షాట్ కూడా చూపించలేదు. ఐతే ట్రైలర్లో అగ్గి మంటల మధ్య సీతారామరావు అవతారంలో చరణ్‌ను చూపించడంతో మెగా అభిమానులకు మెంటలెక్కిపోయింది. తారక్-పులి షాట్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ దృశ్యం కనువిందు చేసింది.
This post was last modified on December 9, 2021 2:52 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…