అల్లు అర్జున్‌ని లారీ డ్రైవర్‌గా మార్చి.. రష్మిక మందాన్నని పల్లెటూరి యువతిగా చేంజ్ చేసేసి.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ లాంటి వారందరినీ డిఫరెంట్ లుక్స్‌లోకి షిఫ్ట్ చేసి.. ‘పుష్ప’ని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా చెక్కుతున్నాడు సుకుమార్. అలాంటి సినిమాలో సమంతని స్పెషల్ సాంగ్ చేయడానికి తీసుకుంటే ఎలా ఉంటుంది! ఆల్రెడీ ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపైపోయాయి.
ఇంతమంది డిఫరెంట్‌గా కనిపిస్తున్న ఈ చిత్రంలో సమంత ఎలా కనిపించనుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. దానికి రెండు రోజుల్లో తెరపడబోతోంది. సమంత సాంగ్‌ని ఈ నెల 10న విడుదల చేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ సాగే ఈ పాటతో ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ గ్యారంటీ అని చెప్పడానికి ఓ పోస్టర్‌ను కూడా వదిలింది.
ఇందులో సామ్ కనిపించీ కనిపించకుండా ఉన్నా.. ఆమె సొగసు మాత్రం కళ్లలో జొరబడుతోంది. సూటిగా పోయి గుండెల్ని పట్టి లాగేసేలా ఉంది. బ్లూ కలర్ డ్రెస్‌లో, సూదంటు చూపులతో ఖతర్నాక్ లుక్‌లో కనిపించి మురిపిస్తోంది సమంత. చేయి చాపి రమ్మని రా రమ్మని పిలుస్తోంది. పాట సంగతెలా ఉన్నా ఈ పోస్టర్‌తోనే సగం ఫ్లాట్ చేశారని చెప్పొచ్చు.
సుకుమార్ సినిమాల్లో మిగతా పాటలన్నీ ఒకెత్తు. ఐటమ్ సాంగ్స్ ఒకెత్తు. ప్రతిదీ సూపర్ డూపర్ హిట్టు. ఇదీ ఆ స్థాయిలోనే ఉండబోతోందని సామ్ గెటప్ చూస్తే అర్థమైపోతోంది. ఈ సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్కి రాక్‌స్టార్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడట. చంద్రబోస్ ఊరమాస్ లిరిక్స్ రాశారట. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పాట రిలీజ్ కానుంది. అంటే మరో రెండు రోజుల్లో సామ్ సాంగ్‌తో దేశమంతా సెగలు రేగుతాయన్నమాట.
This post was last modified on December 9, 2021 7:19 am
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…