తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో పౌరాణిక సినిమా చేయాలంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు నందమూరి బాలకృష్ణదే. ఈ విషయంలో తనకు సాటి, పోటీ లేరని స్వయంగా బాలయ్యే చెబుతుంటాడు. అదేమీ అతిశయోక్తిగా అనిపించదు కూడా. తెలుగులో పౌరాణిక, జానపద, ఆధ్యాత్మిక చిత్రాలు పూర్తిగా ఆగిపోతున్న దశలో భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేశాడు బాలయ్య.
ఆ తర్వాత కూడా పాండురంగడు, శ్రీరామరాజ్యం లాంటి చిత్రాల్లో నటించాడు. ఇక కొన్నేళ్ల కిందట చారిత్రక నేపథ్యంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తే దానికి మంచి ఫలితం కూడా వచ్చింది. ఐతే ఇకపై బాలయ్యతో ఇలాంటి సినిమాలు చేయడం సందేహంగానే ఉంది. ఈ నందమూరి హీరోతో ఆ టైపు సినిమాలు చేసే దర్శకులు, నిర్మాతలు ఎవరు అనే ప్రశ్న కూడా తలెత్తడం సహజం.
ఐతే సీనియర్ నిర్మాత, బాలయ్యకు అత్యంత సన్నిహితుల్లో ఒకడైన సి.కళ్యాణ్.. ఆయనతో శంకరాచార్య సినిమా చేయాలనుకుంటున్నారట. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన గొప్ప తత్వవేత్త , వేదాంతవేత్త అయిన శంకరాచార్యుల మీద సినిమా తీయాలన్నది తన కల అని.. ఆ పాత్ర చేయడానికి బాలయ్యను మించిన ప్రత్యామ్నాయం లేదని సి.కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం బాలయ్య కమిటైన మూడు చిత్రాల తర్వాత ఆయనతో ఈ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కళ్యాణ్ తెలిపాడు.
ఐతే ఈ చిత్రానికి దర్శకుడెవరనే విషయం వెల్లడించలేదు. ఐతే గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాల్లో అయితే హీరోయిజం ఉంటుంది, భారీ యుద్ధ సన్నివేశాలుంటాయి కాబట్టి ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారు కానీ.. పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలో నడిచే శంకరాచార్యుల మీద సినిమా తీస్తే ఏమేర రుచిస్తుంది, కమర్షియల్‌గా ఇది ఏమేర వర్కవుట్ అవుతుంది అన్నదే సందేహం.
This post was last modified on December 8, 2021 8:43 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…