భీమ్లానాయక్ సంక్రాంతి రిలీజ్ గురించి ప్రకటన వచ్చిన కొన్ని నెలలు దాటింది. కానీ పక్కాగా పండక్కే సినిమా రిలీజవుతుందన్న నమ్మకం మాత్రం కలగట్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7కు ఖరారైన దగ్గర్నుంచి ‘భీమ్లా నాయక్’ విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందని మీడియాలో.. సోషల్ మీడియాలో రావడం.. ఆ వార్తల్ని చిత్ర బృందం ఖండించడం.. జనవరి 12నే రిలీజ్ అంటూ ప్రతి కొత్త ప్రోమోలోనూ నొక్కి వక్కాణించడం.. ఇదీ వరస. నిన్న కూడా ఇలాంటి ప్రచారమే జరగ్గా.. నిర్మాత నాగవంశీ వెంటనే స్పందించాడు.
‘భీమ్లా నాయక్’ సంక్రాంతికే వస్తుందని తేల్చి చెప్పాడు. అయినా సరే.. ప్రచారం ఆగట్లేదు. ఈ చిత్రం ఫిబ్రవరి 25కు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ను సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి దాదాపు నెల రోజులుగా ఇండస్ట్రీలో అన్ని వైపుల నుంచీ విపరీతమైన ఒత్తిడి వస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు సహా ఎంతోమంది ‘భీమ్లా నాయక్’ టీం మీద ప్రెజర్ పెడుతూనే ఉన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా ప్రైడ్ అని.. దాని మీద బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టారని.. దానికి థియేటర్ల సమస్య రాకుండా చూడటం కోసం ‘భీమ్లా నాయక్’ తప్పుకోవాలి అన్నది వారి మాట. ఐతే కేవలం ‘భీమ్లా నాయక్’ను మాత్రమే ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది అర్థం కాని విషయం. సంక్రాంతికి మరో పెద్ద సినిమా ‘రాధేశ్యామ్’ కూడా షెడ్యూల్ అయి ఉంది.
అది రేసు నుంచి తప్పుకోవాలన్న మాట ఎవ్వరి నుంచీ రావడం లేదు. దాని ఊసే ఎవరూ ఎత్తడం లేదు. ఏమన్నా అంటే అది పాన్ ఇండియా మూవీ, డేట్ మార్చడం కష్టం అంటున్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ కోసమని జనవరి 6న రావాల్సిన ఆలియా భట్ మూవీ ‘గంగూబాయి’ని వాయిదా వేయించినపుడు ‘రాధేశ్యామ్’కు కూడా డేట్ మార్పించవచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ‘భీమ్లా నాయక్’ తప్పుకుంటే.. పరిమిత సంఖ్యలోనే థియేటర్లలో ‘బంగార్రాజు’ను రిలీజ్ చేద్దామని నాగ్ చూస్తున్నాడు. మరి ఆ సినిమా విషయంలోనూ అభ్యంతరాలు లేవు కానీ.. ఒక్క ‘భీమ్లా నాయక్’ను మాత్రమే రేసు నుంచి తప్పించడానికి ఇంతగా ఒత్తిడి తేవడం ఎంత వరకు న్యాయం?
This post was last modified on %s = human-readable time difference 3:07 pm
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…