కొంతమంది హీరోలు సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత తమ క్రూ మెంబర్స్ కి కొన్ని గిఫ్ట్ లను ఇస్తుంటారు. ఈ కల్చర్ ఎక్కువగా కోలీవుడ్ లో చూస్తుంటాం. అజిత్, విజయ్ లాంటి హీరోలు చాలా సార్లు తమ క్రూ మెంబర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన సినిమా క్రూ మెంబర్స్ శ్రమను గుర్తిస్తూ.. వారికి బంగారపు ఉంగరాలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో రింగ్ పది గ్రాముల వరకు ఉంటుందని తెలుస్తోంది. దాదాపు పన్నెండు మందికి బన్నీ ఈ ఉంగరాలను గిఫ్ట్ గా ఇచ్చాడట.
నిజానికి ‘పుష్ప’ సినిమాను డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ అప్పటికి ఐటెం సాంగ్ పూర్తి కాలేదు. దీంతో అభిమానుల్లో టెన్షన్ ఉండేది. సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. కానీ అలా జరగడం లేదు. అనుకున్నదానికంటే ముందుగానే ఐటెం సాంగ్ ను కంప్లీట్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో అల్లు అర్జున్-సమంతల మీద ఐటెం సాంగ్ షూటింగ్ ను పూర్తి చేశారు.
అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి చేయడానికి కారణమైన ఈ సాంగ్ క్రూ మెంబర్స్ ను బన్నీ ప్రశంసించాలని అనుకున్నాడు. అందుకే స్పెషల్ గా గోల్డ్ రింగ్స్ ను గిఫ్ట్ గా ఇచ్చి తన ప్రేమను తెలియజేశాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
This post was last modified on December 8, 2021 12:44 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…