ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన శ్రియా.. పెళ్లి తరువాత కాస్త జోరు తగ్గించింది. ఈ మధ్యనే మళ్లీ వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనౌన్స్ చేసినప్పుడు అభిమానులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. తన ప్రెగ్నన్సీ విషయాన్ని శ్రియా చాలా రహస్యంగా దాచింది. తన కూతురికి తొమ్మిది నెలలు వచ్చేవరకు కూడా.. శ్రియా తల్లైన విషయాన్ని బయట పెట్టలేదు.
రీసెంట్ గా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తన కూతురికి రాధ అనే పేరు పెట్టినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ నటించిన ‘గమనం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రమోషన్స్ లో పాల్గొనడం కోసం హైదరాబాద్ కు వచ్చింది శ్రియా. ఈ క్రమంలో మీడియాలో మాట్లాడింది. ఇదే సందర్భంలో తన ఫిట్నెస్ సంగతులు షేర్ చేసుకుంది.
తల్లైన తరువాత బాడీలో మార్పులు వచ్చాయని.. హార్మోనల్ చేంజస్ వలన బరువు పెరిగానని.. డెలివెరీ తరువాత కొన్నాళ్లు అలానే ఉన్నానని.. కానీ వర్కవుట్ చేసి షేప్ లోకి వచ్చానని చెప్పింది శ్రియా. కథక్ డాన్స్ చేస్తూ.. బరువు తగ్గానని అలానే యోగా చేయడం వలన ఆరోగ్యం, ఫిట్నెస్ అంతా బాగుంటుందని తెలిపింది.
తన కూతురు గురించి మాట్లాడుతూ.. పిల్లలు పుట్టాక ప్రపంచం మారిపోతుందని.. ఇప్పుడు ఎక్కడకి వెళ్లినా.. తన కూతుర్ని తీసుకునే వెళ్తున్నామని, పాప లేకపోతే ఉండలేమని చెప్పుకొచ్చింది.
This post was last modified on December 7, 2021 10:09 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…