Movie News

పవన్, రాజమౌళి కలవరేమో..?

దర్శకధీరుడు రాజమౌళి, పవన్ కళ్యాణ్ ల మధ్య త్వరలోనే మీటింగ్ జరగనుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని రాజమౌళి కలవలేదు. ఇప్పుడు కలిసి అవకాశం కూడా లేదనిపిస్తుంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జనవరి 7న విడుదల చేయడానికి ఫిక్స్ చేసుకున్నారు. దీంతో సంక్రాంతి రావాలనుకున్న ఒకట్రెండు సినిమాలు వెనక్కి వెళ్లాయి.

కానీ పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ మాత్రం వెనక్కి తగ్గలేదు. 
చెప్పినట్లుగానే జనవరి 12న పవన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘భీమ్లానాయక్’ సినిమా వాయిదా పడితే ‘ఆర్ఆర్ఆర్’కి లాభం ఉంటుంది. లేదంటే మళ్లీ థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో ఈ పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకురావడానికి రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నారు.

పవన్ కళ్యాణ్ ని కలిసి కన్విన్స్ చేస్తే.. ‘భీమ్లానాయక్’ను వాయిదా వేసుకుంటారేమోనని ఆశ పడ్డారు రాజమౌళి. కానీ ఇప్పటివరకు వీరి మధ్య మీటింగ్ జరగలేదు. ప్రస్తుతానికి ‘భీమ్లానాయక్’ రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. పవన్ కళ్యాణ్ అదే డేట్ కి రావాలని ఫిక్స్ అయితే మాత్రం రాజమౌళి ఇక ఆయన్ని కలిసి రిక్వెస్ట్ చేయకపోవచ్చు.

నిజానికి ఇప్పటివరకు ‘భీమ్లానాయక్’ షూటింగ్ పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే సినిమా నుంచి నాలుగు పాటలను రిలీజ్ చేశారు. మరొక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ డిసెంబర్ 14న రానా పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లానాయక్’ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారంటే.. పవన్ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేనట్లే!

This post was last modified on December 7, 2021 3:32 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

17 mins ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

56 mins ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

1 hour ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

2 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

3 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

4 hours ago