Movie News

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్ ఫార్ములాకు దూరంగా వెళ్లే ప్రయత్నంలో చేసిన ఇరుముడి విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ఆగస్ట్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మజిలీ, టక్ జగదీశ్, ఖుషి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఇరుముడికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇవాళో చిన్న టీజర్ లాంచ్ చేశారు.

పూర్తిగా కాదు కానీ స్టోరీ లైన్ క్లుప్తంగా రివీల్ చేశారు. కూతురే ప్రాణంగా బ్రతికే ఒక తండ్రికి తాగుడు అలవాటు ఉంటుంది. అయితే దాన్ని తొలుత నిర్లక్ష్యం చేసే క్రమంలో వీళ్లిద్దరికీ అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. దీంతో మందు మానేయాలంటే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం మంచి మార్గమని భావించి కూతురితో పాటు దీక్ష తీసుకుంటాడు. ఇంతకీ ఈ కుటుంబాన్ని కమ్మిన శత్రువులు ఎవరు, ఇంత ఫ్లాష్ బ్యాక్ ఏంటి, భార్య ఏమయ్యింది లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

హడావిడి లేకుండా, సింపుల్ ఫాదర్ డాటర్ ఎమోషన్ తో మంచి ఫీల్ అయితే ఇచ్చారు శివ నిర్వాణ. అలాని మాస్ అంశాలు టచ్ చేయలేదని కాదు. కత్తి పట్టుకుని రౌడీల భుజాలను ఎక్కి వాళ్ళ భరతం పట్టే శాంపిల్ కూడా పొందుపరిచారు. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అయ్యప్ప భక్తులను లక్ష్యంగా చేసుకున్న ఇరుముడికి పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. గతంలో స్టార్ హీరోతో ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఎవరూ చేయలేదు.

చిరంజీవి బిగ్ బాస్ లో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే హీరో మాలలో కనిపిస్తాడు కానీ ఇలా ఇరుముడి లాంటి టైటిల్ పెట్టి అయ్యప్ప నేపధ్యాన్ని హైలైట్ చేయడం ఇదే మొదటిసారి. జనవరిలో భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన రవితేజ ఈసారి ఇరుముడితో హిట్టు కొట్టాల్సిందే. ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకు మంచి మద్దతు కనిపిస్తోంది. కోలీవుడ్ ఫేమ్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ తదితర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.

This post was last modified on June 3, 2026 12:21 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

8 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

9 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

9 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

9 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

11 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

12 hours ago