నందమూరి బాలకృష్ణ వీక్ ఏరియాస్‌లో నైజాం ఒకటన్న సంగతి తెలిసిందే. బాలయ్య హిట్ సినిమాలు కూడా తెలంగాణలో అనుకున్నంత మేర వసూళ్లు రాబట్టవు. హైదరాబాద్‌లో ఓ మోస్తరుగా స్పందన ఉంటుంది కానీ.. మిగతా ప్రాంతాల్లో వసూళ్లు సినిమా స్థాయికి తగినట్లు రావు. ఇటు రాయలసీమలో, అటు ఆంధ్రాలో మాత్రం బాలయ్య సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు బాగుంటాయి.
గత కొన్నేళ్లలో బాలయ్య చిత్రాల్లో బాగా ఆడిన వాటికి కూడా నైజాంలో వసూళ్లు తక్కువగానే కనిపిస్తాయి. అందుకే ఈ నందమూరి హీరో సినిమాలకు మిగతా ఏరియాలతో పోలిస్తే నైజాంలో బిజినెస్ కూడా తక్కువగానే అవుతుంటుంది. ఐతే ఈ ట్రెండును ఇప్పుడు ‘అఖండ’ మార్చేస్తోంది. ఈ సినిమాకు మిగతా చోట్ల మాదిరే నైజాంలోనూ అదిరిపోయే స్పందన వస్తోంది. ఆ రెస్పాన్స్ ఏ రేంజిలో ఉందంటే ఫస్ట్ వీకెండ్ అయ్యేలోపే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయేంత.
అఖండ సినిమాకు నైజాంలో థియేట్రికల్ హక్కులు రూ.10.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఐతే తొలి రోజే తెలంగాణ ప్రాంతంలో ఈ చిత్రానికి అనూహ్యంగా రూ.6.6 కోట్ల గ్రాస్, రూ.4.4 కోట్ల షేర్ వచ్చింది. తర్వాతి రెండు రోజుల్లోనూ ఈ సినిమా ఈ ప్రాంతంలో జోరు కొనసాగించింది. శుక్ర, శనివారాల్లో ఈ చిత్రానికి నైజాంలో రూ.4.5 కోట్ల షేర్ వచ్చింది. మూడు రోజుల షేర్ రూ.9.1 కోట్లు కాగా.. ఆదివారం సినిమా హౌస్‌ఫుల్స్‌తో రన్ అవుతోంది. సెకండ్ షోలు అయ్యేసరికి ఈ చిత్రం లాభాల బాట పట్టడం లాంఛనమే.
ఆంధ్రా, రాయలసీమల్లో మాదిరే ఇక్కడా ‘అఖండ’ను ఇక్కడ మెజారిటీ థియేటర్లలో రిలీజ్ చేయగా.. తర్వాతి రెండు రోజుల్లో కొత్త సినిమాల కోసం కొన్ని థియేటర్లు తీసేసి.. మళ్లీ వాటికి సరైన స్పందన లేకపోవడం, ‘అఖండ’ టికెట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తిరిగి దానికి స్క్రీన్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. వరంగల్, కరీంనగర్ లాంటి బాలయ్య వీక్ ఏరియాస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తోంది. ఫుల్ రన్లో నైజాం బయ్యర్లకు భారీ లాభాలే అందించేలా కనిపిస్తోంది ‘అఖండ’.
This post was last modified on December 5, 2021 10:35 pm
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…