బాలీవుడ్ ముద్దుగుమ్మ నర్గీస్ ఫక్రీను టాలీవుడ్ కి పరిచయం చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు అనుకున్నారు. కానీ కుదరలేదు. నిజానికి ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ముందుగా నర్గీస్ ఫక్రీను తీసుకోవాలనుకున్నారు. అనూహ్యంగా సమంత ప్రాజెక్ట్ లోకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు క్రిష్ ఈ బాలీవుడ్ బ్యూటీని తెలుగు తెరకు పరిచయం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కి చోటు ఉండడంతో దానికోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ఎంపిక చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఓ కేసులో ఇరుక్కుంది. దాన్ని పరిష్కరించుకోవడానికి ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది.
ఇలాంటి సమయంలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో పవన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె స్థానంలో నర్గీస్ ఫక్రీను తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. పవన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ అంటే ఏ హీరోయిన్ కాదంటుంది. కాబట్టి కచ్చితంగా నర్గీస్ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.
This post was last modified on December 5, 2021 10:28 pm
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…
ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…
దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…
నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా…
వైసీపీ మాజీ మంత్రి, కీలక నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.…
విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం ఎంత ఇబ్బందికరంగా ఉందో తెలిసిందే. లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి భారీ డిజాస్టర్లతో అతను…