Movie News

రోజుకు 265 కోట్లు.. అక్కర్లేదన్న హీరో

ఒక సినిమా హీరోకు ఒక ప్రకటనలో నటించడం కోసం 265 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నామా.. అది కూడా ఒక్క రోజులో ఆ యాడ్ షూట్ పూర్తి చేస్తామని చెబితే అది ఎంత పెద్ద ఆఫరో చెప్పేదేముంది? ప్రపంచంలో ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే.. ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తాడా? కళ్లు మూసుకుని కాల్ షీట్ ఇచ్చేయకుండా ఉంటాడా? కానీ హాలీవుడ్ స్టార్ జార్జ్ క్లూనీ మాత్రం ఈ బంపర్ ఆఫర్‌ను తిరస్కరించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేశాడు.

ఒక దేశానికి చెందిన ఎయిర్ లైన్స్ కంపెనీ.. తమ సంస్థకు సంబంధించిన యాడ్‌లో నటించేందుకు జార్జ్ క్లూనీకి 35 మిలియన్ యుఎస్ డాలర్లు ఆఫర్ చేసిందట. అంటే ఆ మొత్తం భారతీయ కరెన్సీలో అయితే అక్షరాలా 265 కోట్ల రూపాయలు. కేవలం ఒక్క రోజు షూట్‌తో ఈ ప్రకటన పూర్తి చేస్తామని కూడా చెప్పారట. కానీ అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.

అందుక్కారణం… ఆ విమానయాన కంపెనీ ఏ దేశంలో ఏర్పాటైందో… ఆ దేశం మీద క్లూనీకి సదుద్దేశం లేదట. మానవ హక్కుల ఉల్లంఘనలో సదరు దేశం తరచుగా వార్తల్లో నిలుస్తోందని.. ఇలాంటి దేశానికి చెందిన ఎయిర్ లైన్స్‌కు తాను ప్రచారం చేయలేనని ఖరాఖండిగా చెప్పేశారట. ఐతే ఆ దేశం, ఆ ఎయిర్ లైన్స్ పేర్లేంటన్నవి వెల్లడి కాలేదు. మన దగ్గరా బోలెడన్ని బ్రాండ్లకు ప్రచారం చేసే సెలబ్రెటీలు ఉన్నారు.

వాళ్లు ప్రచారం చేసే వాటిలో గుట్కా బ్రాండ్లున్నాయి. మద్యం బ్రాండ్లున్నాయి. తాము జీవితంలో ఎప్పుడూ ముట్టుకోని, ప్రమాదకర ఉత్పత్తులకు వాళ్లు ప్రచారం చేస్తుంటారు. తద్వారా తమ అభిమానులు, యువతను ప్రభావితం చేస్తుంటారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలన్న సూచనల్ని అస్సలు పట్టించుకోరు. ఇలాంటి నేపథ్యంలో జార్జ్ క్లూనీ వందల కోట్ల విలువైన డీల్‌ను తన విలువల కోసం కాదనుకోవడం విశేషమే.

This post was last modified on December 5, 2021 9:01 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

3 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

4 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

4 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

4 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

6 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

7 hours ago