ఈ రోజుల్లో సినిమా సమీక్షలకు ఉన్న ప్రాధాన్యం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు ప్రేక్షకులు సమీక్షలు ఎలా ఉన్నాయో చూసుకునే థియేటర్లకు వెళ్తున్నారు. సమీక్షలు బాగుంటేనే ఆక్యుపెన్సీ బాగుంటుంది. కలెక్షన్లు బాగుంటాయి. అవి బాలేకుంటే సాయంత్రానికల్లా థియేటర్లు ఖాళీ అయిపోతుంటాయి.
భారీ అంచనాలతో రిలీజయ్యే సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరగడం వల్ల బ్యాడ్ టాక్, నెగెటివ్ రివ్యూల వల్ల తొలి రోజు ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ రెండో రోజుకు మాత్రం వీటి ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది. కానీ చాలా కొన్ని సినిమాలు మాత్రమే టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను దున్నేస్తుంటాయి. వసూళ్ల మోత మోగిస్తుంటాయి. సరిగ్గా అఖండ అలాంటి సినిమానే అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి వచ్చిన టాక్.. అది వసూళ్లు రాబడుతున్న వసూళ్లకు అసలు పొంతనే కనిపించడం లేదు.
అఖండ తీసిపడేయదగ్గ సినిమా కాదు. అలాగని అదిరిపోయే మూవీ అని కూడా చెప్పలేం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలతో పోలిస్తే ఇది వీక్ మూవీనే. సినిమాలో చెప్పుకోవడానికి చాలా లోపాలున్నాయి. సరైన కథ లేదు. ద్వితీయార్దంలో అయితే కేవలం ఫైట్లతోనే లాగించేశాడు బోయపాటి. వాటి మోతాదు మరీ ఎక్కువైపోయింది కూడా.
ఐతే ఇన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ.. బాలయ్య అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు అదేమీ పట్టట్లేదు. బాలయ్యను చాలా ఫెరోషియస్‌గా చూపించడం, హీరో ఎలివేషన్లు ఓ రేంజిలో ఉండటం, యాక్షన్ పార్ట్ అదిరిపోవడంతో వాటితోనే వారికి కడుపు నిండిపోతోంది. కరోనా టైం మొదలయ్యాక క్రాక్ మినహాయిస్తే సరైన మాస్ సినిమానే లేకపోవడం, వకీల్ సాబ్ మినహా పెద్ద సినిమాలు కరవైపోవడంతో పక్కా మాస్ మసాలా సినిమా కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అఖండ రావడంతో సమీక్షలు, టాక్ గురించి ఏమీ పట్టించుకోకుండా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి మ్యాజిక్స్ బాక్సాఫీస్ దగ్గర అరుదుగానే జరుగుతాయి.
This post was last modified on December 4, 2021 10:54 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…